విధాత ఎఫెక్ట్.. అందంగా మారిన అధ్వాన్న రోడ్లు

చినుకు పడితే చిత్తడిగా మారి అధ్వానంగా తయారైన రోడ్ల ను అధికారులు అందంగా తీర్చిదిద్దారు. జ్యోతి నగర్ కాలనీలోని రెండు ప్రధాన విద్యాలయాలకు వెళ్లే చిత్తడిగా ఉన్న దారులు గుంతల మయం కావడంతో ‘విధాత’ పత్రిక ప్రచురించిన ‘అద్దాలమేడలు అధ్వాన రోడ్లు’ కథనానికి స్పందించి శుక్రవారం రోడ్లు బాగు చేశారు

విధాత ఎఫెక్ట్.. అందంగా మారిన అధ్వాన్న రోడ్లు

‘విధాత’ కథనానికి అధికారుల స్పందన
కాలనీలో గుంతల రోడ్లు మాయం

జనగామ, సెప్టెంబర్ 5 (విధాత): చినుకు పడితే చిత్తడిగా మారి అధ్వానంగా తయారైన రోడ్ల ను అధికారులు అందంగా తీర్చిదిద్దారు. జ్యోతి నగర్ కాలనీలోని రెండు ప్రధాన విద్యాలయాలకు వెళ్లే చిత్తడిగా ఉన్న దారులు గుంతల మయం కావడంతో ‘విధాత’ పత్రిక ప్రచురించిన ‘అద్దాలమేడలు అధ్వాన రోడ్లు’ కథనానికి స్పందించి శుక్రవారం రోడ్లు బాగు చేశారు. దీంతో కాలనీవాసుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. దీంతో వాహనదారులకు పాదాచారులకు తిప్పలు తప్పాయి. జనగామ జిల్లా కేంద్రంలోని జీఎంఆర్ కాలనీ జ్యోతి నగర్ బాలాజీ నగర్ కాలనీలో లింక్ రోడ్లలలో ఉన్న గుంతలను మట్టితో పూడ్చడంతో అందంగా తయారయ్యాయి. దీంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్లను పునరుద్ధరించినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.