Sreeleela | శ్రీలీలకు రాజయోగం: జాతకం చెప్పిన వేణుస్వామి..! యంగ్‌ బ్యూటీ కెరీర్‌పై కామెంట్స్‌..!

Sreeleela | శ్రీశీల టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. కన్నడ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీబిజీగా మారింది. ఇటీవల బేబీ సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ సైతం ప్రత్యేకంగా శ్రీలీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నది. నటనతో పాటు డ్యాన్స్‌తో ఫిదా చేస్తున్నది. ఇదిలా ఉండగా.. శ్రీలీల గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి జోష్యం చెప్పారు. ఇప్పటికే టాలీవుడ్‌కు […]

Sreeleela | శ్రీలీలకు రాజయోగం: జాతకం చెప్పిన వేణుస్వామి..! యంగ్‌ బ్యూటీ కెరీర్‌పై కామెంట్స్‌..!

Sreeleela |

శ్రీశీల టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. కన్నడ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీబిజీగా మారింది. ఇటీవల బేబీ సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ సైతం ప్రత్యేకంగా శ్రీలీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ప్రస్తుతం ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నది. నటనతో పాటు డ్యాన్స్‌తో ఫిదా చేస్తున్నది. ఇదిలా ఉండగా.. శ్రీలీల గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి జోష్యం చెప్పారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖల జాతకాలు చెప్పి వార్తల్లో నిలిచిన వేణుస్వామి మరోసారి.. శ్రీలీల కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీలీల ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్‌ మహారాజ్‌ రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నటనతో పాటు డ్యాన్స్‌తో ఆకట్టుకున్నది. ఇప్పుడు ఏకంగా శ్రీలీల ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. అలాగే పలు యాడ్స్‌ సైతం వస్తున్నది.

ఈ క్రమంలో వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌లో శ్రీలీల చాలా సంవత్సరాలు అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘శ్రీలీల సౌత్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది. నటనలో మరో మైలు రాయిని చేరుకోబోతుంది. శ్రీలీలా రాశి మీనరాశి. ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది. ఈ రాజయోగానికి పెద్ద పేరు తెచ్చే యోగం ఉంది. పేరు పెరిగే కొద్దీ ధన ప్రవాహం పెరుగుతుంది. 2028 వరకు శ్రీలీల టాలీవుడ్‌లో పెద్ద పేరు తెచ్చుకుంటుంది’ అంటూ వేణుస్వామి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. దక్షిణాదిలో నయనతార లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది. పదేళ్లుగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నది. నయనతార జతకానికి అత్యంత సన్నిహతంగా ఉన్న జాతకం శ్రీలీలదేనని వేణుస్వామి అంచనా వేశారు. టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత, రష్మిక, పూజా హెగ్డేలను మంచి సౌత్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలుస్తుందని వేణుస్వామి చెప్పారు.

వేణుస్వామి ఇప్పటికే పలువురి జాతకాలు అంచనాలు వేసిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని నిజమయ్యాయి. నాగచైతన్య – సమంత జంట విషయంలో ఇది జరిగింది. ఇటీవల టాలీవుడ్‌ హీరోయిన్స్‌ డింపులో హయాతి, నిధి అగర్వాల్‌తో పాటు పలువరు తమ కెరీర్ సక్సెస్ కోసం వేణుస్వామితో పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే.