Madagascar | ఒకే సారి స్టేడియంలోకి 50 వేల మంది.. తొక్కిస‌లాటలో 12 మంది మృతి

Madagascar | విధాత‌: మ‌డ‌గాస్క‌ర్‌లో ఘోర దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజ‌ధాని అంటానానిరివోలో తొక్కిస‌లాట జ‌రిగి 12 మంది మృతి చెందారు. 80 మందికి పైగా తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఇక్క‌డి బ‌రీయా స్టేడియంలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ఓష‌న్ గేమ్స్ ప్రారంభ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున్న క్రీడా అభిమానులు రావ‌డంతో ఈ ఘోరం జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఒకే ప్ర‌వేశద్వారం గుండా సుమారు 50 వేల మంది ప్రేక్ష‌కులు వెళ్లాల‌ని ప్ర‌యత్నించ‌డ‌మే ఈ ప్రమాదానికి కార‌ణంగా భావిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు […]

Madagascar | ఒకే సారి స్టేడియంలోకి 50 వేల మంది.. తొక్కిస‌లాటలో 12 మంది మృతి

Madagascar |

విధాత‌: మ‌డ‌గాస్క‌ర్‌లో ఘోర దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజ‌ధాని అంటానానిరివోలో తొక్కిస‌లాట జ‌రిగి 12 మంది మృతి చెందారు. 80 మందికి పైగా తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఇక్క‌డి బ‌రీయా స్టేడియంలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ఓష‌న్ గేమ్స్ ప్రారంభ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున్న క్రీడా అభిమానులు రావ‌డంతో ఈ ఘోరం జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఒకే ప్ర‌వేశద్వారం గుండా సుమారు 50 వేల మంది ప్రేక్ష‌కులు వెళ్లాల‌ని ప్ర‌యత్నించ‌డ‌మే ఈ ప్రమాదానికి కార‌ణంగా భావిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌టంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాల‌ని దేశ అధ్య‌క్షుడు ఆండ్రీ రోజోలీనా పిలుపునిచ్చారు. అంద‌రూ ఒకేసారి స్టేడియంలోకి ప్ర‌వేశించాల‌నుకోవ‌డ‌మే శుక్ర‌వారం జ‌రిగిన ఈ ప్ర‌మాదానికి కార‌ణం అని ఆయ‌న త‌న సందేశంలో వెల్ల‌డించారు.

ప్ర‌మాదం జ‌రిగిన చోట త‌మ త‌మ వారి నుంచి త‌ప్పిపోవ‌డంతో చాలా మంది అయోమ‌యంగా వెతుక్కుంటున్న‌ట్లు ప‌లు వీడియోల్లో క‌నిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ చెల్లాచెదురుగా బాటిళ్లు, క‌ర్చీఫ్‌లతో ఆ ప్ర‌దేశం గంద‌ర‌గోళంగా మారింది. ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి జ‌రిగే ఇండియ‌న్ ఓష‌న్ గేమ్స్ మ‌డ‌గాస్క‌ర్‌లో సెప్టెంబ‌రు 3 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది.