యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించండి: CM KCR

రేపు కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ పండిన ప్రతి గింజా కొంటామని గతంలోనే చెప్పిన సీఎం, మంత్రులు విధాత: యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి సివిల్‌ సప్లై కమిషనర్‌ అనిల్‌ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున వరి సాగవుతున్నది. యాసంగిలోనూ పెద్ద ఎత్తున సాగవుతున్నది. కొన్ని జిల్లాల్లో పంట చేతికి వచ్చి కల్లాల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం […]

  • By: krs    latest    Apr 09, 2023 2:12 PM IST
యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించండి: CM KCR
  • రేపు కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌
  • పండిన ప్రతి గింజా కొంటామని గతంలోనే చెప్పిన సీఎం, మంత్రులు

విధాత: యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి సివిల్‌ సప్లై కమిషనర్‌ అనిల్‌ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున వరి సాగవుతున్నది. యాసంగిలోనూ పెద్ద ఎత్తున సాగవుతున్నది. కొన్ని జిల్లాల్లో పంట చేతికి వచ్చి కల్లాల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

పండించిన ప్రతి గింజను కొంటామని సీఎం కేసీఆర్‌, మంత్రులు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్‌ యాసంగి వరికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారిని, సివిల్‌ సప్లై కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

గత వానకాలం, యాసంగిలో 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం వరి కొనుగోలు చేసింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 7 వేల వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

తక్షణమే ఆయా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం స్పష్ట చేశారు. ఈ కొనుగోళ్లపై కలెక్టర్లతో రేపు సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు, కార్యాచరణ రూపొందించనున్నారు