Manchiryala: బండి సంజయ్‌ను బర్తరఫ్ చేసి.. పార్లమెంట్‌కు పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలి: MLA దివాకర్ రావు
విధాత: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ […]

విధాత: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా బండి సంజయ్ పైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకున్న సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు భవిష్యత్తు ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయకుండా అనర్హత వేటువేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.