Strings Bridge | కృష్ణా నదిపై తీగల వంతెనకు కేంద్రం ఆమోదం

Strings Bridge విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని సిద్ధేశ్వరం, తెలంగాణాలోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది. వంతెన నిర్మాణం, పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.1,519 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.436.91 కోట్లు కేటాయించింది. తీగల వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత పర్యాటకాభివృద్ధి ఊపందుకోవడంతో ఆ మార్గంంలో […]

  • Publish Date - July 7, 2023 / 11:42 AM IST

Strings Bridge

విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని సిద్ధేశ్వరం, తెలంగాణాలోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది.

వంతెన నిర్మాణం, పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.1,519 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.436.91 కోట్లు కేటాయించింది. తీగల వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత పర్యాటకాభివృద్ధి ఊపందుకోవడంతో ఆ మార్గంంలో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.