విద్యార్థుల విహార‌యాత్ర‌లో విషాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం

విధాత : స‌ర‌దాగా సాగిపోతున్న విద్యార్థుల విహార‌యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అతి వేగం 9 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. ఈ ఘోర ప్ర‌మాద ఘ‌ట‌న కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఎర్నాకులంలోని బాసిలియోస్ విద్యానికేత‌న్ కాలేజీకి చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు టీచ‌ర్లు విహార‌యాత్ర‌కు బ‌య‌ల్దేరారు. అయితే బుధ‌వారం రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో వ‌డ‌క్కెంచెరి వ‌ద్ద టూరిస్ట్ బ‌స్సు.. మ‌రో వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేయబోయింది. అదుపుత‌ప్పిన బ‌స్సు.. కేర‌ళ […]

విద్యార్థుల విహార‌యాత్ర‌లో విషాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం

విధాత : స‌ర‌దాగా సాగిపోతున్న విద్యార్థుల విహార‌యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అతి వేగం 9 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. ఈ ఘోర ప్ర‌మాద ఘ‌ట‌న కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఎర్నాకులంలోని బాసిలియోస్ విద్యానికేత‌న్ కాలేజీకి చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు టీచ‌ర్లు విహార‌యాత్ర‌కు బ‌య‌ల్దేరారు. అయితే బుధ‌వారం రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో వ‌డ‌క్కెంచెరి వ‌ద్ద టూరిస్ట్ బ‌స్సు.. మ‌రో వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేయబోయింది. అదుపుత‌ప్పిన బ‌స్సు.. కేర‌ళ ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు, ఒక టీచ‌ర్, ఆర్టీసీ బ‌స్సులోని ముగ్గురు ప్ర‌యాణికులు మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆర్టీసీ బ‌స్సులో 80 మంది ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. టూరిస్ట్ బ‌స్సు డ్రైవ‌ర్ అతి వేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు.

ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 36 మందిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు తర‌లించి చికిత్స అందిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల్లో 12 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని కేర‌ళ రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి ఆంటోని రాజు, స్థానిక మంత్రి ఎంబీ రాజేశ్ వైద్యుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు.