విదేశీ సినిమాలు చూసినందుకు విద్యార్థుల కాల్చివేత
ఉత్తర కొరియా చీకటి పాలనకు అద్దం పట్టిన ఘటన విధాత: ఉత్తర కొరియాలో విద్యార్థులను కాల్చి చంపిన ప్రభుత్వం. దాంతో వారు ఎంతటి దేశ ద్రోహ కార్యానికి పాల్పడ్డారో అని అనుకుంటాం. కానీ వారు చేసిన నేరం… సినిమాలు చూడటం. అదీ శత్రు దేశాలుగా ప్రకటించిన దేశాల సినిమాలు. అలా చేస్తే పాలకునికి కోపం కపాలానికి తాకింది. వెంటనే ఆ విద్యార్థులను బహిరంగంగా కాల్చి చంపాలని ఆదేశించాడు. ఉత్తర కొరియా నియంత చెప్పిందే వేదం. చేసిందే చట్టం. […]

- ఉత్తర కొరియా చీకటి పాలనకు అద్దం పట్టిన ఘటన
విధాత: ఉత్తర కొరియాలో విద్యార్థులను కాల్చి చంపిన ప్రభుత్వం. దాంతో వారు ఎంతటి దేశ ద్రోహ కార్యానికి పాల్పడ్డారో అని అనుకుంటాం. కానీ వారు చేసిన నేరం… సినిమాలు చూడటం. అదీ శత్రు దేశాలుగా ప్రకటించిన దేశాల సినిమాలు. అలా చేస్తే పాలకునికి కోపం కపాలానికి తాకింది. వెంటనే ఆ విద్యార్థులను బహిరంగంగా కాల్చి చంపాలని ఆదేశించాడు.
ఉత్తర కొరియా నియంత చెప్పిందే వేదం. చేసిందే చట్టం. విదేశీ సంస్కృతి, సినిమాలు, కూల్ డ్రింక్‌లు, చివరికి బట్టలను కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తాయని కిమ్‌జోంగ్ భావించాడు. అనుకున్నదే తడవుగా వాటిని దేశంలో నిషేధించాడు. కానీ చైనా సరిహద్దు ప్రాంతం ర్యాంగాంగ్ ప్రావిన్స్‌లో హై స్కూలు విద్యార్థులు కొందరు దక్షిణ కొరియా సినిమాలు, అమెరికా నాటికలు చూశారట.
ఈ విషయం తెలుసుకొన్న అధికారులు అందులో ఇద్దరిని అరెస్టు చేశారు. చేసిన నేరానికి శిక్షగా వారికి మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి, అమలు చేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కిమ్‌జోంగ్ పాలనలో ఉత్తర కొరియా ఎంతటి దుర్భర స్థితిలో ఉన్నదో ఈ ఘటన అద్దం పడుతున్నది.