Nalgonda: అంధుల పాఠశాల ఆకస్మిక మూసివేత.. కలెక్టరేట్ ఎదుట ధర్నా
విధాత: నల్గొండ జిల్లా కేంద్రంలో 25 ఏళ్లుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలను మూసివేయాలన్న నిర్వాహకుల నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాల అంధ విద్యార్థులు సోమవారం కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి నుండి పదవ తరగతి వరకు ప్రస్తుతం ఇందులో 72 మంది విద్యార్థినీ, విద్యార్థులం ఉన్నామని, అకస్మాత్తుగా నిర్వాహకులు పొనుగోటి చొక్కారావు పాఠశాలను మూసివేస్తున్నామని, భవనాన్ని ప్రైవేటు కళాశాలకు లీజుకు ఇస్తామని ప్రకటించడం ద్వారా తమ భవిష్యత్తుకు అన్యాయం చేస్తున్నారంటూ […]

విధాత: నల్గొండ జిల్లా కేంద్రంలో 25 ఏళ్లుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలను మూసివేయాలన్న నిర్వాహకుల నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాల అంధ విద్యార్థులు సోమవారం కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకటి నుండి పదవ తరగతి వరకు ప్రస్తుతం ఇందులో 72 మంది విద్యార్థినీ, విద్యార్థులం ఉన్నామని, అకస్మాత్తుగా నిర్వాహకులు పొనుగోటి చొక్కారావు పాఠశాలను మూసివేస్తున్నామని, భవనాన్ని ప్రైవేటు కళాశాలకు లీజుకు ఇస్తామని ప్రకటించడం ద్వారా తమ భవిష్యత్తుకు అన్యాయం చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మా అంధ విద్యార్థుల కోసం దాతలు ఎన్నారైల నుండి భారీగా విరాళాలు సేకరించి నిర్మించిన భవనాన్ని నిర్వాహకులు వారి స్వార్థం కోసం లీజుకు ఎలా ఇస్తారని వారు నిలదీశారు. ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి అంధుల పాఠశాల భవనాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగా పాఠశాల నిర్వహించాలని కోరారు.
లేదంటే అంధ విద్యార్థుల జీవితాలు మరింత చీకటి మయం అవుతాయని అలా కాకుండా మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై కలెక్టర్ కు, జిల్లా అధికారులకు పాఠశాల అంధ విద్యార్థులు వినతి పత్రం అందించారు.