Internet Apocalypse | రెండేళ్ల తర్వాత ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలనుందా?
Internet Apocalypse విధాత: సూర్యుడు ఒక సైకిల్ ప్రకారం.. తన వేడిని తగ్గిస్తూ పెంచుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అలా సూర్యుడు తన పూర్తి శక్తిని వెలువరించినపుడు ఉపరితలంపై సౌర తుపానులు (Solar Storms) రేగి అంతరిక్షంలోకి ప్రవేశిస్తాయి. ఆ తరంగాలు (Waves) భూమి మీద ఉన్న సమాచార వ్యవస్థను దెబ్బ తీసే స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. 2025లో సూర్యుడు పూర్తిస్థాయిలో ఉష్ణాన్ని వెదజల్లుతాడని తెలుస్తోంది. అయితే భూమి పైన […]

Internet Apocalypse
విధాత: సూర్యుడు ఒక సైకిల్ ప్రకారం.. తన వేడిని తగ్గిస్తూ పెంచుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అలా సూర్యుడు తన పూర్తి శక్తిని వెలువరించినపుడు ఉపరితలంపై సౌర తుపానులు (Solar Storms) రేగి అంతరిక్షంలోకి ప్రవేశిస్తాయి. ఆ తరంగాలు (Waves) భూమి మీద ఉన్న సమాచార వ్యవస్థను దెబ్బ తీసే స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. 2025లో సూర్యుడు పూర్తిస్థాయిలో ఉష్ణాన్ని వెదజల్లుతాడని తెలుస్తోంది.
అయితే భూమి పైన దేశాలు, ప్రదేశాలన్నీ డిజిటల్‌గా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమై ఉన్న ఈ రోజుల్లో సౌర తుపానులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. కొంత మంది యూజర్లు నాసా ప్రకటించిందని చెబుతూ 2025లో ఇంటర్నెట్ వ్యవస్థ నాశనం అయిపోతుందని.. సూర్యుని నుంచి వచ్చే తుపానుల ధాటికి మన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమీ ఉండవని ప్రచారం చేస్తున్నారు.
అయితే నాసా (NASA) ఇటువంటి ప్రకటన ఏదీ చేయలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సమాచారంతో మనం ఊపిరి పీల్చుకోవడానికి లేదు. మొత్తం ఇంటర్నెట్ నాశనమవుతందన్నది కొంచెం అతిశయోక్తి అయినప్పటికీ.. ఎంతో కొంత మేర నష్టం ఉంటుందన్నది పరిశీలకుల మాట.
గతంలో సౌర తుపానులు భూమిని తాకాయా?
సమీప గతాన్ని పరిశీలిస్తే 1859లో సౌర తుపాను తరంగాలు భూమిని తాకాయి. అప్పటి వార్తల ప్రకారం.. ప్రపంచంలో చాలాచోట్ల టెలిగ్రాఫ్ లైన్లు కాలిపోవడం.. టెలిగ్రాఫ్ ఆపరేటర్లకు విద్యుత్ షాకులు కొట్టడం జరిగింది. 1989లో స్వల్ప స్థాయిలో సౌర తుపాను రాగా.. క్యూబెక్ పవర్ స్టేషన్ గ్రిడ్ కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. అయితే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత బాగా రూపుదిద్దుకున్న తర్వాత సౌర తుపానులు రాలేదు. కాబట్టి వస్తే ఏమవుతుందన్నది ఊహే తప్ప.. ఇతమిద్ధంగా ఇది జరుగుతందని శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు.
మనం ఎప్పుడూ అలాంటి సౌర తుపానులు ఊహించలేదు. కాబట్టి మన పరికరాలను అటువంటి పరిస్థితులకు గురిచేసి పరీక్షించలేదు. అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతివెల్లడించారు. ఆవిడ రాసిన సోలార్ సూపర్‌స్టోర్మ్ – ప్లానింగ్ ఫర్ యాన్ ఇంటర్నెట్ అపోకాలిప్సే అనే పరిశోధక పత్రం వల్లనే దీనిపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఒకవేళ భయంకరమైన సౌర తుపాను కనుక భూమిని తాకితే సముద్ర గర్భంలో కమ్యునికేషన్ కోసం ఏర్పాటు చేసుకున్న కేబుల్స్ దెబ్బతింటాయి.
దీని వల్ల దూర ప్రాంతాల మధ్య జరిగే కమ్యునికేషన్స్‌కు అంతరాయం కలగొచ్చు అని జ్యోతి వెల్లడించారు. ఈ అంతరాయం అనేది కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఒక వేళ అలా జరిగితే ఒక్క అమెరికాలోనే రోజుకి రూ.90,529 కోట్ల నష్టం వస్తుందని అంచనా. ఆర్థిక నష్టాన్ని ఎలాగోలా పూడ్చుకోవచ్చు కానీ.. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా జరిగి ఇంటర్నెట్ కొన్ని నెలలు స్తంభించిపోతే… ఎప్పుడూ నెట్‌లో ఉండటానికి అలవాటుపడిన వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్న.