AP: రాజధానిపై స్టేకు సుప్రీం నో!
జగన్‌కు, టీడీపీకి కట్టా మీఠా ఫ్లేవర్! ఒకే అంశంపై కొంత మోదం.. కొంత ఖేదం! విధాత: ఒకే అంశం మీద కోర్టు ఇచ్చిన తీర్పు రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు అనడానికి అమరావతి మీద తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే ఉదాహరణ. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుమీద స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు ఇంకో అంశంలో మాత్రం హై కోర్టుకు వత్తాసు పలికింది. రాజధాని మీద చట్టం చేసే […]

- జగన్‌కు, టీడీపీకి కట్టా మీఠా ఫ్లేవర్!
- ఒకే అంశంపై కొంత మోదం.. కొంత ఖేదం!
విధాత: ఒకే అంశం మీద కోర్టు ఇచ్చిన తీర్పు రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు అనడానికి అమరావతి మీద తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే ఉదాహరణ. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుమీద స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు ఇంకో అంశంలో మాత్రం హై కోర్టుకు వత్తాసు పలికింది. రాజధాని మీద చట్టం చేసే అధికారం లేదంటూ ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి సుప్రీం అంగీకరించలేదు.
ఏపీ సీఆర్ డీ ఏ చట్టంలో షెడ్యూల్ 2, 3 మరియు ల్యాండ్ పూలింగ్ నియమాలు 2015 ను అమలు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం, ఈ అంశంలో స్టే ఇవ్వడానికి నో చెప్పింది. ఇదే సందర్భములో రైతుల భూములను రాజధాని నిర్మాణానికి తప్ప వేరే అవసరాలకు ఉపయోగించకూడదన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి కూడా సుప్రీం నిరాకరించింది. అంతే కాకుండా పార్లమెంటు చేసిన చట్టాన్నిఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదని ప్రశ్నించింది.
ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందన్న సుప్రీంకోర్టు. పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను మాత్రం ఎలా సవరిస్తారని ప్రశ్నించింది. రైతులకు చట్టబద్దంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించింది. ఏపీ సిఆర్డీ ఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా?అనఇ పేర్కొంది.
ఇప్పటికే అమరావతిలో రూ.50వేల కో్ట్ల రూపాయల మేరకు పెట్టిన పెట్టుబడుల సంగతేమిటి? పార్లమెంటులో చట్టానికి సవరణ చేయమని కేంద్రాన్ని రాష్ట్రం ఆశ్రయించవచ్చు కదా? రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును కర్నూలుకు ఎలా మార్చుతారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నల పరంపర కొనసాగించింది. దీంతో ఈరోజు తీర్పులో నచ్చిన అంశాలను వారు తీసుకుని సంతోష పడుతున్నారు. ఏపీలో మీడియా సంస్థలు కూడా ఇదే విధంగా తాము లైన్ తీసుకుని వార్తలు ప్రచురిస్తున్నాయి.