చర్చనీయాంశంగా సూర్యాపేట ఎస్పీ శైలి!.. విద్యార్థులతో మంత్రికి జయహో(VIDEO)
విద్యార్థులతో మంత్రికి జయహో అనిపించిన ఎస్పీ విధాత, నల్గొండ: సూర్యాపేటలో శుక్రవారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహరించిన తీరు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సభలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన సందర్భంలో తాను జయహో మంత్రి జగదీష్ రెడ్డి గారికి అంటే మీరంతా జయహో అనాలి అంటూ విద్యార్థులను కోరి మరి ఆయన వారితో అలాగే జయహో అనిపించారు. ఆకలేస్తే కేకలేయ్యాలి అన్న శ్రీశ్రీ మాటను […]

- విద్యార్థులతో మంత్రికి జయహో అనిపించిన ఎస్పీ
విధాత, నల్గొండ: సూర్యాపేటలో శుక్రవారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహరించిన తీరు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సభలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన సందర్భంలో తాను జయహో మంత్రి జగదీష్ రెడ్డి గారికి అంటే మీరంతా జయహో అనాలి అంటూ విద్యార్థులను కోరి మరి ఆయన వారితో అలాగే జయహో అనిపించారు.
ఆకలేస్తే కేకలేయ్యాలి అన్న శ్రీశ్రీ మాటను విద్యార్థులకు గుర్తు చేసి, బాహుబలి సినిమాలో బాహుబలి రాగానే ప్రజల కేకలతో సింహాసనం అదిరినట్లుగా ఈ సభా వేదిక అదిరి పోవాలంటూ చెప్పి మరి ఎస్పీ జయహో మంత్రి జగదీష్ రెడ్డికి జయహో అని విద్యార్థులతో గట్టిగా అనిపించారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ రకంగా రాజకీయ కార్యకర్త మాదిరిగా మంత్రికి జై కొట్టించడం ద్వారా ఎస్పీ కొంత తన ఉద్యోగ పరిధి దాటి అత్యుత్సాహం ప్రదర్శించారని అధికార, రాజకీయ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి.
అయితే ఈ వ్యవహారంలో తనపై వస్తున్న వ్యాఖ్యల పట్ల ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ తాను కేవలం విద్యార్థులను ఉత్సాహా పరిచేందుకు మాత్రమే అలా చేశానని అంతకుమించి అందులో అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.