Suryapeta | 70ఎకరాల్లో లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ
Suryapeta సూర్యాపేట సభ ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి జగదీశ్ రెడ్డి విధాత: ఉమ్మడి నల్లగొండ బ్యూరో, సీఎం కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో సీఎం కేసీఆర్ సభను 70ఎకరాల్లో లక్ష మందితో నిర్వహిస్తామని మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ సభ స్థలం ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. […]

Suryapeta
- సూర్యాపేట సభ ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత: ఉమ్మడి నల్లగొండ బ్యూరో, సీఎం కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో సీఎం కేసీఆర్ సభను 70ఎకరాల్లో లక్ష మందితో నిర్వహిస్తామని మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ సభ స్థలం ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.
జనసమీకరణ సన్నాహాలపై సుమంగళి ఫంక్షన్ హాల్లో పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో సైతం బీఆరెస్ పార్టీ మొత్తం 12 సీటింగ్ స్థానాల్లోనూ గెలుస్తుందన్నారు. మేము సింహాలమని మాకు ఎదురే లేదని విర్ర వీగిన కాంగ్రెస్ వృద్ద సింహాలను మట్టికరిపించిన ఘనత సీఎం సారథ్యంలోని బీఆరెస్ యువ ఎమ్మెల్యేలదన్నారు.
రాష్ట్రం లో 119 శాసన సభ స్థానాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కి తప్పా, కాంగ్రెస్, బీజేపీలకు స్థానమే లేదన్నారు. రైతు రుణమాఫీతో పాటు ఆర్ టి సి నీ ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, విఆర్ఏలను క్రమబద్దీకరించడం వంటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ షాక్ నుండి ఇప్పుడిప్పుడే విపక్షాలు కోలుకునేలా లేవన్నారు.
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా, ఏమి కావాలో తెలిసిన నాయకుడిగా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ , ఆసరా పెన్షన్ల నుండి నిన్నటి రుణ మాఫీ వంటి పధకాలను తీసుకువచ్చి ప్రజల మనసులో సీఎం కేసీఆర్ సుస్థిర స్థానం పొందారని కొనియాడారు.
పరిపాలన సౌలభ్యం కోసం సూర్యాపేటను జిల్లాగా మార్చి, అద్భుతమైన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయ భవనం, మోడల్ మార్కెట్ తో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెడికల్ కాలేజీని నిర్మించి సూర్యాపేట విశిష్టతను కీర్తిని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.
కాళేశ్వరం జలాలతో సూర్యాపేట నియోజకవర్గాన్ని పచ్చని మాగాణి గా మార్చిన అపరభగీరథడు సీఎం కేసీఆర్ రాక కోసం సూర్యాపేట ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు.
సీఎం సభకు నాలుగు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో 17 వ తేదీ నుండి ఉమ్మడి జిల్లాకు చెందిన శాసన సభ్యులు నియోజక వర్గంలోనే తిష్టవేసి సూర్యాపేట నియోజక వర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటి వార్డులలో వేరు వేరు గా బాధ్యతలు తీసుకోని, సభకు వచ్చే ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. ఉమ్మడి జిల్లా నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తును సభకు తరలిరానున్నందునా వారికి బీఆరెస్ శ్రేణులు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.