స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబోకు నోబెల్

విధాత‌: స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబో ఈ ఏడాది వైద్య‌రంగంలో నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. అంత‌రించిన స‌హోద‌రుల జాతుల‌తో పోలిస్తే ఆధునిక మాన‌వుడి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎలా ప్ర‌త్యేక‌మో ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. మాన‌వ ప‌రిణామ క్ర‌మంపై ఆయ‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ గౌర‌వం ద‌క్కింది. స్వాంటే పాబోను వైద్య‌రంగంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక చేసిన‌ట్లు స్వీడ‌న్‌లోని స్టాక్ హో్ం క‌మిటీ కార్య‌ద‌ర్శి థామ‌స్ పెర్ల్‌మాన్ ప్ర‌క‌టించారు. పాబో నోబెల్ విజేత‌గా నిలిచారు. అంత‌రించిన స‌హోద‌ర […]

  • By: krs    latest    Oct 04, 2022 2:08 AM IST
స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబోకు నోబెల్

విధాత‌: స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబో ఈ ఏడాది వైద్య‌రంగంలో నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. అంత‌రించిన స‌హోద‌రుల జాతుల‌తో పోలిస్తే ఆధునిక మాన‌వుడి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎలా ప్ర‌త్యేక‌మో ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. మాన‌వ ప‌రిణామ క్ర‌మంపై ఆయ‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ గౌర‌వం ద‌క్కింది.

స్వాంటే పాబోను వైద్య‌రంగంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక చేసిన‌ట్లు స్వీడ‌న్‌లోని స్టాక్ హో్ం క‌మిటీ కార్య‌ద‌ర్శి థామ‌స్ పెర్ల్‌మాన్ ప్ర‌క‌టించారు. పాబో నోబెల్ విజేత‌గా నిలిచారు. అంత‌రించిన స‌హోద‌ర జ‌న్యు రాశిని ఆధునిక మాన‌వుడి జ‌న్యురాశితో పోల్చిన పాబో కొవిడ్ వైర‌స్ లాంటి మ‌హ‌మ్మారుల‌ను ఎలా త‌ట్టుకోగ‌లిగామో క‌నిపెట్టారు.