Swastika Mukherjee | మార్ఫింగ్‌ ఫొటోలతో ఆ నిర్మాత వేధిస్తున్నాడు.. నటి సంచలన ఆరోపణలు!

Swastika Mukherjee | విధాత: బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ (Swastika Mukherjee) బాలీవుడ్‌తో పాటు బెంగాలీలో వరుస సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బెంగాలీ టీవీ సిరీస్ దేవదాసితో (Devadasi) చిత్రసీమలోకి అడుగుపెట్టింది స్వస్తిక ముఖర్జీ హేమంతర్ పాఖీ చిత్రంతో సినిమాల్లోకి అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత మస్తాన్, ముంబయి కటింగ్ తదితర బాలీవుడ్‌ సినిమాలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న శిబ్పూర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ […]

Swastika Mukherjee | మార్ఫింగ్‌ ఫొటోలతో ఆ నిర్మాత వేధిస్తున్నాడు.. నటి సంచలన ఆరోపణలు!

Swastika Mukherjee |

విధాత: బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ (Swastika Mukherjee) బాలీవుడ్‌తో పాటు బెంగాలీలో వరుస సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బెంగాలీ టీవీ సిరీస్ దేవదాసితో (Devadasi) చిత్రసీమలోకి అడుగుపెట్టింది స్వస్తిక ముఖర్జీ హేమంతర్ పాఖీ చిత్రంతో సినిమాల్లోకి అరంగ్రేటం చేసింది.

ఆ తర్వాత మస్తాన్, ముంబయి కటింగ్ తదితర బాలీవుడ్‌ సినిమాలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న శిబ్పూర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వస్తిక సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాత సందీప్‌ సర్కార్‌ తనను లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్లు ఆరోపించింది.

తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు గురి చేస్తూ మెయిల్స్‌ పంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఫొటోలను పోర్న్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాడని, అందులో నగ్న ఫొటోలు ఉన్నాయని వాపోయింది.

ఈ విషయంపై స్వక్తిక బెంగాల్‌లోని గోల్ఫ్‌ గ్రీన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అన్ని ఆధారాలతో పాటు ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను సంప్రదించనున్నట్లు తెలిపింది. అయితే, శిబ్పూర్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత సందీప్ సర్కార్‌ను మాత్రం కలువలేదని చెప్పింది.

ఇండో అమెరికానా ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అజంతా సింగ్‌ రాయ్‌తో పాటు సందీప్‌ సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై చిత్రం దర్శకుడు అరిందం భట్టాచార్య స్పందించారు.

ఏ రంగంలోనైనా సృజనాత్మక విభేదాలు తప్పవని, ఈ విషయంలోనూ అదే జరిగిందన్నారు. దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు దర్శకుడే స్వస్తికను పురి గొల్పాడని వస్తున్న ఆరోపణలు భట్టాచార్య ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. స్వస్తిక లాంటి నటిని ప్రోత్సహిస్తానని దర్శకుడు స్పష్టం చేశారు.