వరుస నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోండి: ఉద్యోగార్దులకు గుత్తా అమిత్ పిలుపు

విధాత{ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రణాళికతో ఉద్యోగ సాధనకు సన్నద్ధమై ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని గుత్తా అమిత్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేహదారుడ్య పరీక్షలకు హాజరయిన అభ్యర్థులకు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి […]

  • By: krs    latest    Dec 23, 2022 1:39 AM IST
వరుస నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోండి: ఉద్యోగార్దులకు గుత్తా అమిత్ పిలుపు

విధాత{ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రణాళికతో ఉద్యోగ సాధనకు సన్నద్ధమై ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని గుత్తా అమిత్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేహదారుడ్య పరీక్షలకు హాజరయిన అభ్యర్థులకు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పౌష్టికాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి అభ్యర్థిని ఆయన ఆప్యాయంగా పలకరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కరోనా కష్ట కాలంలో కరోన పాజిటివ్ పేషంట్స్ కి పౌష్టికాహారం, మాస్కులు, సానీటైజర్లు ,మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఆక్సిజన్ కిట్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశామన్నారు. అలాగే గత ఎనిమిదవ తేదీ నుండి మేకల అభినవ్ స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ఫిజికల్ టెస్ట్స్ కి హాజరవుతున్న అభ్యర్థులకు రోజుకు దాదాపు 1300 మందికి పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని, జనవరి 4 తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26,400 మంది అభ్యర్థులకు పౌష్టికాహారం అందిస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్ లు విడుదల చేస్తుందన్నారు నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్టంలో నీళ్లు, నియమాకాల సాధనలో పురోగతి సాధించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కక్ష్యపూరిత ధోరణి, వివక్షతో రాష్టానికి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

సీఎం కేసీఆర్ విజన్ తో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. దేశ ప్రజలందరు కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుతున్నారని గుత్తా అమిత్ రెడ్డి చెప్పారు. తమ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని, ఎలాంటి సహాయసహకారాలు కావాలన్న సంప్రదించవచ్చని అమిత్ రెడ్డి హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుబ్బ అశోక్ సుందర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,ఐత గోని స్వామి గౌడ్, యామ దయాకర్, మందడి మధుసూదన్ రెడ్డి, హరి కృష్ణ ,నూనె రవీందర్, చిలుకరాజు శ్రీనివాస్, మైనారిటీ నాయకులు బషీరుద్దీన్, హన్ను, రిటైర్డ్ వార్డెన్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు