త్రివిక్రమ్‌ను మునగ చెట్టు ఎక్కించిన తమన్..!

విధాత‌: RRR చిత్రంతో రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్ రేసులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డును కూడా నాటు నాటు సాంగ్ సాధిస్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ వ‌రకు వెళ్ల‌డంతో మరోసారి దేశవ్యాప్తంగా రాజమౌళి హాట్ టాపిక్ అయ్యారు. ఈ సినిమాకి […]

త్రివిక్రమ్‌ను మునగ చెట్టు ఎక్కించిన తమన్..!

విధాత‌: RRR చిత్రంతో రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్ రేసులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోంది.

ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డును కూడా నాటు నాటు సాంగ్ సాధిస్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ వ‌రకు వెళ్ల‌డంతో మరోసారి దేశవ్యాప్తంగా రాజమౌళి హాట్ టాపిక్ అయ్యారు. ఈ సినిమాకి లభించిన ఆదరణ, వచ్చిన క్రేజ్ దృష్ట్యా తీసుకుంటే రాజమౌళి తదుపరి మహేష్ బాబుతో చిత్రానికి ఈ బ‌జ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది.

దాంతో సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేసే చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నా ఆశ్చర్య పోవాల్సి పనిలేదు. ఆస్కార్ బ‌రిలో నాటు నాటు సాంగ్ నిలబడింది అంటే ఇండియా నుండి ఏ ఆర్ రెహమాన్ తర్వాత ఆస్కార్ సొంతం చేసుకున్న సంగీత దర్శకునిగా కీరవాణి నిలుస్తారు.

తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ని ఓ విలేకరి రాజమౌళి RRR మూవీతో ఆస్కార్ కి మార్గం వేశారు కదా..! కీరవాణి తరహాలో మీరు కూడా ఎప్పుడు ఆస్కార్ పోటీలకి మీ సాంగ్స్ తో వెళ్తారని అడిగారు. దానికి త‌మ‌న్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

త్రివిక్రమ్ తనని ఆస్కార్కి తీసుకొని వెళ్తారని చెప్పారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. దాంతో ఈ సినిమాని దృష్టిలో ఉంచుకొని తమన్ ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత అంతకుమించిన ఆల్బమ్ ఈ చిత్రానికి ఉంటుందన‌డంలో సందేహం లేదు.

అయితే ఎవరి చిత్రాలు చేస్తుంటే వారిని మునగ చెట్టు ఎక్కించే త‌మ‌న్ తాజాగా త్రివిక్రమ్ ని మునగ చెట్టు ఎక్కించాడని సెటైర్లు వినిపిస్తున్నాయి. రాజ‌మౌళి బాహుబ‌లి రెండు భాగాల‌తోనే పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ కి వెళ్లారు. ఇక ఆర్ఆర్ఆర్ సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు పాన్ ఇండియా రేంజ్ చిత్రాన్ని కూడా తీయ‌లేక‌పోయిన త్రివిక్ర‌మ్ ఏకంగా త‌మ‌న్ ని ఆస్కార్ వ‌ర‌కు తీసుకెళ్తాడ‌ని చెప్ప‌డం చూస్తుంటే త‌మ‌న్ ని ఏమ‌నాలో అర్ధం కావ‌డం లేద‌ని సెటైర్లు వినిపిస్తున్నాయి.