Tamannaah | అలా బోల్డ్ సీన్స్ చేయకపోతే.. అక్కనో, ఆంటీనో చేస్తారు

Tamannaah | ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ వస్తేనే హీరోయిన్ల స్థానం పదికాలాల పాటు నిలబడుతుందని హితబోధ చేస్తుందీ హీరోయిన్. అరవై పదుల వయసులో ఉన్న హీరోల పక్కన హీరోయిన్‌గా చేయడం ఎప్పటి నుంచో వస్తున్నదే అయినా వరుసగా ఇద్దరు సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్‌గా చేస్తున్న ఆ సినిమాల గురించి మీ అనుభవాన్ని పంచుకోండని మీడియా ప్రశ్నించగానే ఎన్నో సంచలనమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. తమన్నా భాటియా. సినిమాల కన్నా ఈ మధ్య […]

  • By: krs    latest    Aug 09, 2023 4:34 AM IST
Tamannaah | అలా బోల్డ్ సీన్స్ చేయకపోతే.. అక్కనో, ఆంటీనో చేస్తారు

Tamannaah |

ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ వస్తేనే హీరోయిన్ల స్థానం పదికాలాల పాటు నిలబడుతుందని హితబోధ చేస్తుందీ హీరోయిన్. అరవై పదుల వయసులో ఉన్న హీరోల పక్కన హీరోయిన్‌గా చేయడం ఎప్పటి నుంచో వస్తున్నదే అయినా వరుసగా ఇద్దరు సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్‌గా చేస్తున్న ఆ సినిమాల గురించి మీ అనుభవాన్ని పంచుకోండని మీడియా ప్రశ్నించగానే ఎన్నో సంచలనమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. తమన్నా భాటియా. సినిమాల కన్నా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్ చేస్తూ రెచ్చిపోతున్న ఈ అమ్మడు తన మనసులోని మాటలను ఇలా పంచుకుంది.

భోళా శంకర్, జైలర్ రెండూ భారీ సినిమాలే.. అలాగే ఇందులో హీరోలుగా చేస్తున్నది కూడా పెద్ద హీరోలే.. ‘భోళా శంకర్‌’లో మెగాస్టార్ చిరంజీవి హీరోకాగా, ‘జైలర్‌’లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్నారు. రెండు సినిమాల్లోనూ తమన్నానే హీరోయిన్. ఈ రెండు సినిమాలూ ఒక్కరోజు గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. వయసులో పెద్దవారైనా వాళ్ళతో నటించడం తన అదృష్టమనే కితాబునిచ్చిందీ మిల్కీ బ్యూటీ.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. కాలానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోకపోతే ఈ సినిమా రంగంలో గెలవడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ ఉంటేనే అటు ప్రేక్షకులు ఇటు దర్శకులు గుర్తుపెట్టుకుంటారు.

అందుకే నేను ట్రెండ్ ఫాలో అవుతా, లేకపోతే పాత వాళ్ళమనే ఫీలింగ్ దర్శకుల్లో కలుగుతుంది. ఈ కారణంగానే ఈమధ్య వెబ్ సిరీస్‌లకి, ముద్దులకి, ఇంటిమేట్ సీన్స్‌కి ఓకే చెప్పానని తెలిపింది. అలా చెప్పకపోతే.. దర్శకనిర్మాతలు నన్ను హీరోలకు అక్కనో, ఆంటీనో చేసేసే వారని చెప్పింది.

ఏది ఏమైనా ఈ వంకతో తను పెంచిన గ్లామర్ డోస్ గురించి కాస్త క్లారిటీ కూడా ఇచ్చేసింది. స్పెషల్ షోలు, ఈవెంట్స్, ఫోటో షూట్స్, వెబ్ సిరీస్ లలో ఈమధ్య తమన్నా చేస్తున్న రచ్చ నెట్టింట పెంచుతున్న హీట్.. అందరికీ తెలియంది కాదు. తనని గుర్తుంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నానని తమన్నా చెప్పడం కూడా మరోసారి ఆమెపై ట్రోలింగ్‌కి కారణం అవుతుందేమో మరి.