Tamilnadu | సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని.. డీఐజీ ఆత్మహత్య
Tamilnadu విధుల్లో ఒత్తిడే కారణమని అనుమానం విధాత: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ- కోయంబత్తూరు రేంజ్) సీ విజయ్‌కుమార్ శుక్రవారం ఉదయం తన క్యాంపు ఆఫీస్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లిన విజయ్‌కుమార్ 6.45 గంటల ప్రాంతంలో తిరిగి క్యాంపు ఆఫీస్‌కు తిరిగి వచ్చారు. వ్యక్తిగత సిబ్బంది […]

Tamilnadu
- విధుల్లో ఒత్తిడే కారణమని అనుమానం
విధాత: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ- కోయంబత్తూరు రేంజ్) సీ విజయ్‌కుమార్ శుక్రవారం ఉదయం తన క్యాంపు ఆఫీస్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లిన విజయ్‌కుమార్ 6.45 గంటల ప్రాంతంలో తిరిగి క్యాంపు ఆఫీస్‌కు తిరిగి వచ్చారు. వ్యక్తిగత సిబ్బంది నుంచి తన సర్వీస్ రివాల్వర్‌ను అడిగి తీసుకున్నారు. రివాల్వర్‌తో క్యాంప్ ఆఫీస్‌కు తిరిగివచ్చిన విజయ్‌కుమార్ 6.50 గంటల ప్రాంతంలో రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. రివాల్వర్ శబ్దం విన్న డీఐజీ కార్యాలయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.
తన విధుల్లో పని ఒత్తిడి కారణంగా కొన్ని వారాలు సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నానని తన సహచర అధికారులతో డీఐజీ విజయ్‌కుమార్ తెలిపినట్టు సమాచారం. కానీ, ఆత్మహత్యకు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
విజయ్‌కుమార్ కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరి 6న బాధ్యతలు చేపట్టారు. వెల్లూరు రేంజ్ డీఐజీగా ట్రాన్స్‌ఫర్ అయిన ముత్తుస్వామి స్థానంలో విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయ్‌కుమార్ .. గతంలో కాంచీపురం, కడలూరు, నాగపట్టణం, తిరువరూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. చెన్నై అన్నానగర్‌లో డిప్యూటీ కమిషనర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రమోషన్ పొంది కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా నియమితులయ్యారు.