Vande Bharat | ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఈ మార్గంలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్పెషల్ రైలు..!
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లను నడుపుతున్నది

Vande Bharat | దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లను నడుపుతున్నది. ఈ రైలును ఇప్పటికే ప్రారంభించిన మార్గాల్లోనే రైల్వే వందేభారత్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. దక్షిణ రైల్వే చెన్నై సెంట్రల్, కోయంబత్తూరు మధ్య మార్చి 5 -12 తేదీల్లో వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి ఉదయం 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు కోయంబత్తూరు నుంచి మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి చెన్నై సెంట్రల్‌కు రాత్రి 21.50 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు ఎనిమిది కోచ్‌లు ఉండనున్నాయి.
కాట్పడి, జోలార్‌పేటై, ఈరోడ్, తిరుప్పూర్‌లో ఆగనున్నది. గతేడాది ఏప్రిల్‌లో చెన్నై-కోయంబత్తూరు మధ్య రైల్వే వందే భారత్ రైలును ప్రారంభించింది. ఈ రైలు నడపడంతో తమిళనాడు రాజధాని-పశ్చిమ పారిశ్రామిక నగరం మధ్య ప్రయాణ సమయం తగ్గింది. గతేడాది ఏప్రిల్‌లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైలు 5.50 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుతుంది.
ఈ రైలు తమిళనాడులోని రెండు నగరాలను కలుపుతూ.. స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవాచ్’ అమర్చారు. అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లతో ప్రయాణీకుల భద్రతను పెంచారు. ఈ రైలులో డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్లు, బ్రెయిలీలో సీట్ హ్యాండిల్ నంబర్లు, ఎల్‌ఈడీ లైట్లు, 360 డిగ్రీలు తిరిగేలా ఆధునిక సౌకర్యాలుంటాయి.