నెల్లూరు: మూఢనమ్మకాలకు మూడేళ్ల కూతురు బలి
విధాత, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చేటు చేసుకుంది. ప్రొక్లెయినర్ కొని…సరిగా పనులు దొరకడం లేదని ఓ వ్యక్తి నకిలీ బాబాను ఆశ్రయించాడు. కుటుంబ సమస్యలు తీరేందుకు కన్నతండ్రి నకిలీ బాబా సలహా విని మూడేళ్ల తన కన్న కూతురిని చంపుకున్నాడు. నెల్లూరు జిల్లా పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ పొక్లెయిన్ బిజినెస్ చేసి నష్టపోయాడు. ఓ బాబా మాటలు విని కవల కూతుళ్లలో ఒకరైన పునర్విక (3)పై పూజలు చేశాడు. ఒంటిపై పసుపు నీళ్లు పోసి, నోటి […]

విధాత, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చేటు చేసుకుంది. ప్రొక్లెయినర్ కొని…సరిగా పనులు దొరకడం లేదని ఓ వ్యక్తి నకిలీ బాబాను ఆశ్రయించాడు. కుటుంబ సమస్యలు తీరేందుకు కన్నతండ్రి నకిలీ బాబా సలహా విని మూడేళ్ల తన కన్న కూతురిని చంపుకున్నాడు.
నెల్లూరు జిల్లా పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ పొక్లెయిన్ బిజినెస్ చేసి నష్టపోయాడు. ఓ బాబా మాటలు విని కవల కూతుళ్లలో ఒకరైన పునర్విక (3)పై పూజలు చేశాడు. ఒంటిపై పసుపు నీళ్లు పోసి, నోటి నిండా కుంకుమ కుక్కాడు. పసుపు, కుంకులతో ఊపిరాడక బాలిక కేకలు వేసింది.
ఇది విన్న స్థానికులు అక్కడికి వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం నాడు చనిపోయింది. కుటుంబ సమస్యలు తీరేందుకు కన్నతండ్రి నకిలీ బాబా సలహా విని కూతురిని చంపుకున్న సంఘటన పలువురిని కలచివేసింది.