Congress | టార్గెట్ తెలంగాణ.. సకల శక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్! టికెట్లు దక్కేది వీరికే?
Congress | ముందే 50-60 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ప్రాథమిక కసరత్తు పూర్తిచేసిన అధిష్ఠానం కర్ణాటక వ్యూహం ఇక్కడా అమలు యోచన జూనియర్, సీనియర్ అన్న తేడాలు లేవు.. ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కే చాన్స్ నియోజకవర్గాల బాట పట్టిన నాయకులు విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠాన వ్యూహాలు ఫలించాయి. ఎన్నిలకు ముందే నేతల మధ్య ఐక్యత సాధించి బీజేపీపై సమర శంఖం పూరించింది. దీంతో ఆ బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా […]

Congress |
- ముందే 50-60 సీట్లకు అభ్యర్థుల ప్రకటన
- ప్రాథమిక కసరత్తు పూర్తిచేసిన అధిష్ఠానం
- కర్ణాటక వ్యూహం ఇక్కడా అమలు యోచన
- జూనియర్, సీనియర్ అన్న తేడాలు లేవు..
- ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కే చాన్స్
- నియోజకవర్గాల బాట పట్టిన నాయకులు
విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠాన వ్యూహాలు ఫలించాయి. ఎన్నిలకు ముందే నేతల మధ్య ఐక్యత సాధించి బీజేపీపై సమర శంఖం పూరించింది. దీంతో ఆ బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా పారలేదు. ఆఖరుకు ఉచితాలు దేశాభివృద్ధికి ఆటంకం అన్న ప్రధాని.. స్వయంగా అనేక ఉచిత హామీలు గుప్పించినా.. కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. అక్కడ ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించినట్టు తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.
ముందుగా 50-60 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నదని తెలుస్తున్నది. దీనిపై పీసీసీ ఇప్పటికే సర్వేలు కూడా పూర్తి చేసిందని అంటున్నారు. వివాదాలు లేని నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థులను తేల్చేయాలని భావిస్తున్నదని తెలుస్తున్నది. అధిష్ఠానం ఎంపిక చేసే అభ్యర్థుల్లో సీనియర్లు, జూనియర్లు అన్నది ప్రామాణికంగా కాకుండా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో దాని ప్రాతిపదికనే తీసుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు? వారు ఎవరు? అన్న సమాచారం బైటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.
పనితీరు బట్టే టికెట్
ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పలుమార్లు అధిష్ఠానాన్ని కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు దక్కవని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ తిరిగే ఆశావహులంతా నియోజకవర్గాల బాట పట్టారు.
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు రేవంత్‌రెడ్డికూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 50-60 స్థానాలకు అభ్యర్థులు రెడీగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి వివాదంలేని ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
టికెట్లు దక్కేది వీరికే?
ఉమ్మడి వరంగల్ జిల్లా
నర్సంపేట: దొంతి మాధవరెడ్డి, వరంగల్ పశ్చిమ: నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు: కొండా సురేఖ, పాలకుర్తి: జంగా రాఘవరెడ్డి: ములుగు: సీతక్క: భూపాలపల్లి -గండ్ర సత్యనారాయణ.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
మంథని: శ్రీధర్‌బాబు, వేములవాడ: ఆది శ్రీనివాస్, జగిత్యాల: జీవన్‌రెడ్డి, హుస్నాబాద్: ప్రవీణ్‌రెడ్డి, హుజురాబాద్: బల్మూరి వెంకట్, చొప్పదండి: మేడిపల్లి సత్యం, మానకొండూరు: కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి: విజయ రమణారావు, ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్, కోరుట్ల: జువ్వాడి నర్సింగరావు
ఉమ్మడి ఖమ్మం జిల్లా
మధిర : భట్టి విక్రమార్క, వైరా: రాందాస్ నాయక్, అశ్వారావు పేట: తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం: పొదెం వీరయ్య
ఉమ్మడి నల్గొండ జిల్లా
నల్లగొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్: ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ: పద్మావతి, సూర్యాపేట: ఆర్ దామోదర్‌రెడ్డి, ఆలేరు: బీర్ల ఐలయ్య, నాగార్జునసాగర్: రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ: బీ లక్ష్మారెడ్డి, భువనగిరి: అనిల్ కుమార్‌రెడ్డి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
నాగర్ కర్నూల్: నాగం జనార్దన్‌రెడ్డి, కొడంగల్: రేవంత్‌రెడ్డి, కల్వకుర్తి: వంశీచంద్‌రెడ్డి, అచ్చంపేట: వంశీకృష్ణ, షాద్‌నగర్: ఈర్లపల్లి శంకర్, అలంపూర్: సంపత్‌కుమార్, మక్తల్: ముదిరాజ్ శ్రీహరి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్: గండ్రోత్ సుజాత, మంచిర్యాల: ప్రేమ్‌సాగర్ రావు, బోధ్: నరేశ్ జాదవ్, బెల్లంపల్లి: గడ్డం వినోద్‌కుమార్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
జుక్కల్: గంగారాం, నిజామాబాద్ అర్బన్: మహేశ్‌కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్: భూపతిరెడ్డి, కామారెడ్డి: షబ్బీర్ అలీ, బోధన్: సుదర్శన్‌రెడ్డి.
ఉమ్మడి మెదక్ జిల్లా
మెదక్: తిరుపతిరెడ్డి, సంగారెడ్డి: జగ్గారెడ్డి, అందోల్: దామోదర రాజనర్సింహ, జహీరాబాద్: గీతారెడ్డి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
మల్కాజ్‌గిరి: నందికంటి శ్రీధర్, వికారాబాద్: గడ్డం ప్రసాద్‌కుమార్, ఇబ్రహీంపట్నం: మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి: రామ్మోహన్‌రెడ్డి.
హైదరాబాద్ జిల్లా
నాంపల్లి: ఫిరోజ్‌ఖాన్, జూబ్లీహిల్స్: విష్ణువర్ధన్‌రెడ్డి, సికింద్రాబాద్: ఆదం సంతోష్, గోషామహల్: సాయికుమార్, మలక్‌పేట్: చెట్లోకర్ శ్రీనివాస్
తెలంగాణపై రాహుల్ ఫోకస్
పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అందుకే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన తెలంగాణలోనూ విజయం మాదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమౌతాయని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఆనవాళ్లు ఎన్నికల తర్వాత ఉండవని జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పై చేయి సాధించడానికి ముందే ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని చిత్తు ఓడించాలనే లక్ష్యం కాంగ్రెస్ అధిష్ఠానంలో ఉన్నదని ఆయన మాటల్లో స్పష్టమైంది.