రెండ‌వ‌సారి క్యాన్స‌ర్ రాకుండా టాబ్లెట్

ముంబాయికి చెందిన క్యాన్స‌ర్ ప‌రిశోధ‌న , చికిత్స సంస్థ టాటా ఇనిస్ట్యూట్ క్యాన్స‌ర్ రెండ‌వ సారి రాకుంటా ప్ర‌త్యేక మైన టాబ్లెట్‌ను రూపొందించామ‌ని ప్ర‌క‌టించింది.

రెండ‌వ‌సారి క్యాన్స‌ర్ రాకుండా టాబ్లెట్

ఒక్క టాబ్లెట్ వంద రూపాయిలు మాత్ర‌మే

అభివృద్ది చేసిన ముంబాయికి చెందిన టాటా ఇనిస్ట్యూట్‌


విధాత‌: ముంబాయికి చెందిన క్యాన్స‌ర్ ప‌రిశోధ‌న , చికిత్స సంస్థ టాటా ఇనిస్ట్యూట్ క్యాన్స‌ర్ రెండ‌వ సారి రాకుంటా ప్ర‌త్యేక మైన టాబ్లెట్‌ను రూపొందించామ‌ని ప్ర‌క‌టించింది. క్యాన్సర్‌ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది. ఈ మేరకు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశామని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్ల‌డించారు.


టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని తెలిపారు. ఈ చికిత్స కోసం ఇన్సిస్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు దాదాపు 10 ఏళ్లు కృషి చేశారని ఆయ‌న‌ వెల్ల‌డించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్‌కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు.