TDP
విధాత: రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో టికెట్స్ కోసం పోటీ… ఆశావహుల ప్రయత్నాలు సైతం ముమ్మరం అవుతున్నాయ్.. ఈ తరుణంలో టికెట్స్ కోసం వారసులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అనుకున్నంత సులువుగా లేకపోవడంతో ఈసారి టిడిపి మరింతగా శ్రమించి పని చేస్తే తప్ప జగన్ను ఎదుర్కోవడం కష్టం అని గ్రహించిన టిడిపి ఇప్పుడు సర్వ శక్తులు ఒడ్డుతోంది.
అయితే ఇప్పుడు వారసులకు టికెట్స్ లేవని, సీనియర్లు తండ్రులకు మాత్రమే టికెట్స్ అని చెప్పడంతో ఇప్పుడు విశాఖలో కొడుకులు పరిస్థితి ఏమిటన్నది తెలీడం లేదు. ప్రస్తుతానికి అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ ఐ-టిడిపి పేరిట సోషల్ మీడియాను లీడ్ చేస్తుండగా మరో నాయకుడు గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ కూడా టికెట్స్ కోసం పోటీలో ఉన్నారు.
రవితేజ ఇప్పటికే పాదయాత్రలో ఉన్న లోకేష్ ను కలిసి మద్దతు తెలిపి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
రవితేజ కూడా నారాయణ అల్లుడు కావడం నారాయణకు కూడా పార్టీలో మంచి హోల్డ్ ఉండడంతో మామ ద్వారా కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే విజయ్ కూడా తాను ఐ – టిడిపి ద్వారా పార్టీ కోసం బాగా పని చేస్తూ కేసులు పాలై నానా ఇక్కట్లు పడ్డానని, తనకు టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబడుతున్నారు.
అయితే వారసులకు టికెట్స్ ఇచ్చేది లేదని, సీనియర్లు మాత్రమే పోటీలో ఉండాలని చంద్రబాబు చెబుతుండగా ఇప్పుడు యూత్ మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.