చెవులపై 18.1 సెం.మీ. పొడ‌వాటి వెంట్రుక‌లు.. గిన్నిస్ రికార్డుకెక్కిన వృద్ధుడు

ear-haired teacher | అక్క‌డ పొడ‌వాటి వెంట్రుక‌లేంటి.. వృద్ధుడు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్క‌డం ఏంట‌ని అనుకుంటున్నారా? మీరు చ‌దివింది నిజ‌మే. కానీ మీరు అనుకున్న‌ట్టు అక్క‌డ కాదు.. ఆ వృద్ధుడి చెవిపై పొడ‌వాటి వెంట్రుక‌లు ఉన్నాయి. ప్ర‌పంచంలో ఏ వ్య‌క్తికి కూడా చెవుల‌పై అంత పొడ‌వు వెంట్రుక‌లు లేవ‌ని తేలింది. దీంతో చెవులపై పొడ‌వాటి వెంట్రుక‌లు క‌లిగిన వ్య‌క్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. భార‌త‌దేశానికి చెందిన ఆంథోని విక్ట‌ర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అత‌ను కొన్నేండ్ల క్రితం ప‌ద‌వీ […]

చెవులపై 18.1 సెం.మీ. పొడ‌వాటి వెంట్రుక‌లు.. గిన్నిస్ రికార్డుకెక్కిన వృద్ధుడు

ear-haired teacher | అక్క‌డ పొడ‌వాటి వెంట్రుక‌లేంటి.. వృద్ధుడు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్క‌డం ఏంట‌ని అనుకుంటున్నారా? మీరు చ‌దివింది నిజ‌మే. కానీ మీరు అనుకున్న‌ట్టు అక్క‌డ కాదు.. ఆ వృద్ధుడి చెవిపై పొడ‌వాటి వెంట్రుక‌లు ఉన్నాయి. ప్ర‌పంచంలో ఏ వ్య‌క్తికి కూడా చెవుల‌పై అంత పొడ‌వు వెంట్రుక‌లు లేవ‌ని తేలింది. దీంతో చెవులపై పొడ‌వాటి వెంట్రుక‌లు క‌లిగిన వ్య‌క్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

భార‌త‌దేశానికి చెందిన ఆంథోని విక్ట‌ర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అత‌ను కొన్నేండ్ల క్రితం ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు. అయితే 2007 నుంచి విక్ట‌ర్ త‌న చెవుల‌పై పొడ‌వాటి వెంట్రుక‌లు ఉన్న వ్య‌క్తిగా ప్ర‌పంచంలోనే రికార్డు సృష్టించారు. విక్ట‌ర్ చెవుల‌పై 18.1 సెంటిమీట‌ర్ల పొడ‌వాటి వెంట్రుక‌లు ఉన్నాయి. దీంతో అత‌ను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే విక్ట‌ర్‌ను చెవి వెంట్రుక‌ల మాస్టార్ అని స్థానికులు పిలుస్తారు.