ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ మొదలవుతుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4 వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపడతారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం, అప్పీళ్ల పై దరఖాస్తు అందిన 15 రోజుల్లో అప్పీళ్ల పరిష్కారం చేయనున్నారు. కోర్టు కేసు నేపథ్యంలో భాషా పండితుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను […]

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ మొదలవుతుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
మార్చి 4 వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపడతారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం, అప్పీళ్ల పై దరఖాస్తు అందిన 15 రోజుల్లో అప్పీళ్ల పరిష్కారం చేయనున్నారు.
కోర్టు కేసు నేపథ్యంలో భాషా పండితుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ షెడ్యూల్లో చేర్చలేదు. పూర్తిస్థాయి షెడ్యూలు వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో లభిస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.