యాదాద్రి: ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయినుల సస్పెన్షన్
విధాత, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చెందిన ఇద్దరు ఉపాధ్యాయినలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం విషయమై సస్పెండ్ చేస్తూ డీఈవో కె. నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు తినుబండారాల కొనుగోలుకు వెళ్లి వేధింపుల గురైన వివాదంలో విచారణ జరిపి ఉపాధ్యాయినులు ఎ. రమాదేవి, టి.రేణుకా దేవిలను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థినిలు మద్యాహ్నం భోజనం సమయంలో […]

విధాత, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చెందిన ఇద్దరు ఉపాధ్యాయినలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం విషయమై సస్పెండ్ చేస్తూ డీఈవో కె. నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాల మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు తినుబండారాల కొనుగోలుకు వెళ్లి వేధింపుల గురైన వివాదంలో విచారణ జరిపి ఉపాధ్యాయినులు ఎ. రమాదేవి, టి.రేణుకా దేవిలను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలకు చెందిన విద్యార్థినిలు మద్యాహ్నం భోజనం సమయంలో పాఠశాల సమీపంలోని కిరాణం దుకాణంలో తినుబండారాలను కొనుక్కోవడానికి వెళ్లిన సందర్భంలో దుకాణ యజమాని బల్ల లింగప్ప ఆ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వివాదంలో భువనగిరి రూరల్ పోలీసులు ఈనెల 8న ఫోక్సో కేసు నమోదు చేసి అతడిని జైలుకు తరలించారు.
అయితే మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థినిలు పాఠశాల ఆవరణ విడిచి వెళ్లడంపై విద్యాశాఖ అంతర్గత విచారణ చేపట్టింది. బల్ల లింగప్ప కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా ఉపాధ్యాయులకు బాధిత విద్యార్ధినిలు చెప్పినప్పటికీ స్పందించక, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వారిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.