పెళ్లి గోల‌.. డెంటిస్ట్‌ను ఎత్తుకెళ్లిన 100 మంది యువ‌కులు (వీడియో)

విధాత: ఈ ఘ‌ట‌న అచ్చం సినిమా స్టైల్లో ఉంది. ఎందుకంటే ఓ యువ‌తిని కిడ్నాప్ చేసేందుకు ఏకంగా 100 మంది యువ‌కులు వ‌చ్చారు. రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి యువ‌తిని బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని రాగ‌న్న‌గూడ‌లో శుక్ర‌వారం ఉద‌యం వెలుగు చూసింది. కిడ్నాప్‌న‌కు గురైన యువ‌తి త‌ల్లి మాటల్లోనే.. నా కూతురు బీడీఎస్ పూర్తి చేసింది. ఇక పెళ్లి చేయాల‌ని […]

  • By: krs    latest    Dec 09, 2022 12:56 PM IST
పెళ్లి గోల‌.. డెంటిస్ట్‌ను ఎత్తుకెళ్లిన 100 మంది యువ‌కులు (వీడియో)

విధాత: ఈ ఘ‌ట‌న అచ్చం సినిమా స్టైల్లో ఉంది. ఎందుకంటే ఓ యువ‌తిని కిడ్నాప్ చేసేందుకు ఏకంగా 100 మంది యువ‌కులు వ‌చ్చారు. రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి యువ‌తిని బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని రాగ‌న్న‌గూడ‌లో శుక్ర‌వారం ఉద‌యం వెలుగు చూసింది.

కిడ్నాప్‌న‌కు గురైన యువ‌తి త‌ల్లి మాటల్లోనే.. నా కూతురు బీడీఎస్ పూర్తి చేసింది. ఇక పెళ్లి చేయాల‌ని పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా ఆయ‌న‌కు తెలిసిన వ్య‌క్తి ద్వారా ఓ సంబంధం వ‌చ్చింది. న‌వీన్ కుమార్ రెడ్డి అనే యువ‌కుడు (టీ టైం ఓనర్‌) ఐదారు నెల‌ల కింద మా ఇంటికి వ‌చ్చాడు. మా బిడ్డ న‌చ్చింది.. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. కానీ మాకు న‌వీన్ న‌చ్చ‌లేదు. ఈ సంబంధం ఇష్టం లేద‌ని చెప్పాం. అయిన‌ ప్ప‌టికీ న‌వీన్ మా కూతురు వెంట ప‌డ్డాడు.

ఇవాళ ఓ సంబంధం చూసేందుకు సిద్ధ‌మ‌య్యాం.. అయితే పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో.. ఇవాళ ఒక సంబంధం వ‌చ్చింది. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా.. న‌వీన్ రెడ్డి ఓ 100 మంది యువ‌కుల‌తో మా ఇంటికి వ‌చ్చాడు. ఇంట్లోకి వ‌చ్చి అన్ని వ‌స్తువుల‌ను ప‌గుల‌గొట్టారు.

నా కూతురు అత‌ను క‌లిసి దిగిన ఫోటోల‌ను ఇంట్లో ప‌డేశాడు. మా బిడ్డ‌ను బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువ‌చ్చిన మ‌మ్మ‌ల్ని, ఇరుగుపొరుగు వారిపై కూడా యువ‌కులు దాడి చేశారు. మా కూతురు ఎక్క‌డ ఉందో ఆచూకీ తెలియ‌దు. ఎలాగైనా మా బిడ్డ‌ను కాపాడంటూ బాధితురాలి త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అపహరణకు గురైన యువతి వైశాలిని పోలీసులు రక్షించారు. సెల్ టవర్ ఆధారంగా ఆమె నల్గొండలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించి వారు ఇచ్చిన సమాచారంతో నల్గొండ పోలీసులు ఆమెను రక్షించి, స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసులో ట్విస్ట్: ఆమె నా భార్య .. లవర్‌ కాదు

అయితే ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్‌లో వైశాలి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. వైశాలి నా భార్య అని లవర్ కాదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

గత ఏడాది ఆగస్టులో బాపట్లలో మా వివాహం జరిగిందని, తల్లిదండ్రులకు భయపడి వైశాలి వారితోనే ఉంటుందని, వైశాలి తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉందని, నా భార్యను నా వద్దకు పంపించడం లేదని సెప్టెంబర్ 30న లీగల్ నోటీసు పంపానని తెలిపారు.

రెండు సంవత్సరాలుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, నన్ను చంపేందుకు వైశాలి తల్లిదండ్రులు వేరే వారికి సుపారి ఇచ్చారని , ఈ ఏడాది జులై నుంచి వైశాలి తన తల్లిదండ్రులతో ఉంటున్నదని మా పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు వైశాలి తల్లిదండ్రులు ధ్వంసం చేశారని, వైశాలి సోదరుడు విదేశాల్లో ఉంటు ఒక ఎన్ అర్ ఐ సంబంధం తీసుకొచ్చాడని తెలిపాడు.