గ్రూప్-1 పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

  • By: Somu    latest    Mar 14, 2024 12:50 PM IST
గ్రూప్-1 పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు

విధాత : గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియాల్సి ఉండగా.. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్‌ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.


రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీకి ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అయితే, ఇప్పటి వరకు 2.7లక్షల వరకు అభ్యర్థులు గ్రూప్‌-1 కోసం దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.