మైహోమ్ సంస్థకు ప్రభుత్వం షాక్‌

మైహోమ్ సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆక్రమిత 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది

మైహోమ్ సంస్థకు ప్రభుత్వం షాక్‌

భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ నోటీసులు

విధాత, హైదరాబాద్: మైహోమ్ సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఆక్రమిత 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైహోమ్ సంస్థ సహా మరో నలుగురికి రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు. భూదాన్ భూముల్లో గత పదేళ్లుగా మైహోమ్ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. భూదాన్ భూముల్లో అక్రమంగా మైహోమ్ సంస్థ చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. గత బీఆరెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన మైహోం సంస్థ పెద్దలు అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇటు జంటనగరాల్లో పలు ఆక్రమణలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం భూదాన్ భూములకు సంబంధించి నోటీస్‌లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది