అమ్మాయిలకు ఉచిత స్కూటీలు.. తెలంగాణ సర్కార్ సన్నాహాలు
ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు విద్యార్థినిలకు, యువతులకు ఉచిత స్కూటీలు ఇస్తామన్న హామీ అమలు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది

విధాత: ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు విద్యార్థినిలకు, యువతులకు ఉచిత స్కూటీలు ఇస్తామన్న హామీ అమలు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు కావాల్సిన కసరత్తు చేస్తుందని సమాచారం. 18సంవత్సరాలు నిండిన యువతులు ఉచిత స్కూటీల పథకానికి అర్హులు. అది కూడా బీపీఎల్ పరిమితిలోని కుటుంబంలోని వారికే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తులు ఎలా చేయాలి..ఎక్కడ చేయాలన్నదానిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత రానుంది.
ప్రస్తుతానికి వెలువడుతున్న సమాచారం మేరకైతే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (https://telangana gov.in) లోకి వెళ్లి ఉచిత స్కూటీ పథకానికి దరకాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు జత చేయాల్సివుంటుంది. సాధారణంగా ఆధార్ కార్డు,,పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్ కామ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.