ఆర్టీసీ కార్మికుల‌కు 21 శాతం ఫిట్‌మెంట్‌

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల‌కు 21 శాతం ఫిట్‌మెంట్‌
  • ఏటా రూ. 418.11 కోట్ల భారం
  • అయినా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌ని
  • వెల్లడించిన ర‌వాణ, బీసీ సంక్షేమ‌ శాఖల‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
  • త్వ‌ర‌లో 3 వేల కొత్త బ‌స్సులు
  • ఆర్టీసీలో ఉద్యోగ నియ‌మ‌కాలు
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి


విధాత‌: ఆర్టీసీ కార్మికుల‌కు, ఉద్యోగుల‌కు 21 శాతం ఫిట్‌మెంట్ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణ‌యించింద‌ని ర‌వాణ,బీసీ సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. 21 శాతం ఫిట్‌మెంట్ అమ‌లుతో ప్ర‌తి ఏటా ఆర్టీసీపై రూ. 418.11 కోట్ల భారం పడుతుంద‌న్నారు. త‌మ‌కు మ‌ద్దతు ఇచ్చిన ఆర్టీసి కుటుంబాకు అండగా ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఈ ఫిట్‌మెంట్ 1జూన్ 2024 నుండి అమలులోకి వస్తుందన్నారు.


ఈ మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్‌లో ఆర్టీసీ ఎంపీ స‌జ్జ‌నార్‌తో క‌లిసి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ ఫిట్‌మెంట్ 21 శాతానికి పెంచడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు దన్యవాదాలు తెలిపారు. 53 వేల 71 మందికి ఈ ఫీట్‌మెంట్ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇంత పెద్ద ప్రకటన లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందన్నారు. 2017 లో 17 శాతం పీఆర్సీ పై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, అప్ప‌టి నుంచి ఇది పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు.


ఆర్టీసీలో ఉన్న‌60 శాతం అక్యుపెన్సి 100 శాతం దాటుతుందని మంత్రి పొన్నం ధీమా వ్య‌క్తం చేశారు. ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియమాలు చేపడతామ‌ని వెల్ల‌డించారు. కొత్త రుట్ల లో బస్సులు నడపాలని డిమాండ్స్ వస్తున్నాయన్నారు. ఆర్టీసీకి 3 వేల బస్సులు వస్తున్నాయని తెలిపారు. ఎవరికి ఏఏ డిపార్ట్మెంట్ లు ఎన్ని పోస్టులు వస్తున్నయనేది డీటైల్స్ ఇస్తామ‌ని తెలిపారు. ఎక్కడ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదని స్ప‌ష్టం చేశారు. సంస్థ ను ముందుకు తీసుకుపోవడనికి అందరం భాగస్వామ్యం కావాలన్నారు.


పెండింగ్ లో ఉన్న‌ 280 కోట్ల బాండ్స్ ఇస్తామ‌ని నెక్లెస్ రోడ్డు లో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రకటించారని, రెండు రోజుల్లో పేమెంట్ జరుగుతాయన్నారు. గ‌తంలో ఆర్టీసీలో జరిగిన అనేక అంశాల వల్ల పీఎఫ్‌, సీసీఎస్‌లను వాడుకున్న ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఆర్టీసీ ఆపరేషనల్ లాస్ నుండి ప్రాఫిట్ ఒరియంటేశన్ కి వెళ్తుంద‌న్నారు. ఉద్యోగుల‌కు బోనస్ లు ఇతర బెనిఫిట్స్ ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకు వెళ్తున్నామ‌న్నారు. ఆర్టీసీ విలీనం పై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మంత్రి తెలిపారు.


ప్రభుత్వం మీద మంత్రి మీద కోపం ఉంటే వేరే పద్దతిలో పొవాల‌ని మంత్రి ప్ర‌తిప‌క్షాల‌కు చుర‌క‌లంటించారు. ఆర్టీసి పై విమర్శలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. దానిని అమలు చేయడంలో ఆర్టీసీ కార్మికులు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌న్నారు. ప్రభుత్వం తరుపున వారికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.


కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిఆపారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తరువాత బస్సులు , బస్ స్టాండ్ లు కళకళలాడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే లాగా ఆర్టీసి బస్సులు పని చేస్తున్నాయన్నారు. ఆర్టీసి ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు.. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తుంటే ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారన్నారు.