తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్, ఈసెట్‌ షెడ్యూల్ విడుదల

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది

తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్, ఈసెట్‌ షెడ్యూల్ విడుదల

విధాత, హైదరాబాద్ : ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 28న నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు లాసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మీ వెల్ల‌డించారు. మార్చి 1 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఏప్రిల్ 15వ చివ‌రి తేదీ . ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించొచ్చు. ఇక జూన్ 3వ తేదీన కంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మూడేండ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ఐదేండ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.


ఈసెట్‌ షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల‌కు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 14వ తేదీన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ సీతారాం వెంక‌టేశ్‌ వెల్ల‌డించారు. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. ఏప్రిల్ 16 తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీగా తెలిపారు. ఆల‌స్య రుసుం రూ. 500తో ఏప్రిల్ 22 వ‌ర‌కు, రూ. 1000తో ఏప్రిల్ 28వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించవచ్చన్నారు. ఏప్రిల్ 24 నుంచి 28వ తేదీ మ‌ధ్య‌లో అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించామని,. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చని, మే 6వ తేదీన ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నట్లుగా తెలిపారు.