Assembly | ఆరోపణలు.. ఎదురుదాడితో సాగిన శాసన సభ
Assembly | ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అభివృద్ధి తెలంగాణ కిందనే.. కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్ విధాత: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు శనివారం అధికార ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, విమర్శల మధ్య ఎదురుదాడి వ్యూహాలతో సాగింది. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తు తాము వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వంటి పథకం తెచ్చిందని ధైర్యంగా […]

Assembly |
- ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అభివృద్ధి తెలంగాణ కిందనే..
- కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
విధాత: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు శనివారం అధికార ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, విమర్శల మధ్య ఎదురుదాడి వ్యూహాలతో సాగింది. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తు తాము వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వంటి పథకం తెచ్చిందని ధైర్యంగా చెప్పామని, అదే కాంగ్రెస్ సభ్యులు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులను మాత్రం అంగీకరించే ధైర్యం చూపడం లేదంటు ద్వజమెత్తారు.
కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్ ఉన్న కేసీఆర్‌కు మధ్య పోటీయా అంటు విమర్శించారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్రయితే మాది నవమాసాలు మోసి కన్న తల్లి పాత్ర అని తెలంగాణ అభివృద్ధి పట్ల మా మామకారం తల్లివంటిదన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో సంక్షేమమే తప్ప సంక్షోభం లేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కంటే ఎక్కువ అభివృద్ధి జరిగినట్లుగా నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అసెంబ్లీలో భట్టి, రఘునందన్‌రావులు సవాల్ విసిరారు. ఇంటింటికి మంచినీరు, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగణలో ఉందన్నారు.
దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో తెలంగణ నెంబర్ వన్ అన్నారు. తెలంగాణలో ఎకరాకు పదివేల పెట్టుబడి సాయం అందుతంుదన్నారు. రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్తు అందుతుందన్నారు. 13లక్షల ఆడబిడ్డలకు పెళ్లికనాఉనకగా 1లక్ష 116రూపాయలు అందించామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ లెక్కలు మాత్రమేనని, బీఆరెస్‌కు రాష్ట్ర ప్రజల జీవన రేఖ అన్నారు. తెలంగణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అన్నారు. గ్రామాలకు పట్టణాలకు సమాన ప్రతినిధ్యం ఇస్తు పారిశ్రామిక, వ్యవసాయ,సేవా రంగాలతో అభివృద్ది ఫథకంలో సాగుతున్నామన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నీళ్ల కోసం రోజుకోక ట్యాంకర్ తెచ్చుకుంటున్నారంటు చేసిన విమర్శలు అవాస్తవమన్నారు. భట్టి ఇంట్లో కూడా మంచినీటీ మీటర్ ఉందని, మీటర్ చెడిపోవడం వ్ల 2.90లక్షలు నీటి బిల్లు చెల్లించాల్సివచి్దన్నారు. లేకుంటే భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదన్నారు.
హైద్రాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి 20వేల లీటర్ల మంచినీరు అందిస్తున్నామన్నారు. ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు తాగిస్తున్నామని, ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామనాన్రు. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ ఉంటారని, మీరు ప్రతిపక్షంలోనే ఉంటారని భట్టిని ఉద్ధేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గత తొమ్మిదేళ్లలో గ్రామాల మంచినీటి సరఫారకకు 29వేలకోట్లు ఖర్చు చేశామని, కాంగ్రెస్ హాయంలో 6వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కేంద్ర మంత్రినే తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగుజలాలు అందుతున్నాయని పార్లమెంటులో చెప్పారన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిల్లీ వదిలిన బాణాలైతే సీఎం కేసీఆర్ బ్రహ్మస్త్రమన్నారు.
బీఆరెస్ పాలనలోనే పేద వర్గాల అభివృద్ధి: మంత్రి తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండలిలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతు తెలంగాణలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగిందన్నారు. బీఆరెస్ ప్రభుత్వం వచ్చాకే పేద వర్గాలు బాగుపడ్డాయన్నారు. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని, పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వ్యవహారశైలి సరిగా లేదన్నారు.
మణిపూర్ మంటల్లో చలి కాచుకుంటున్నారు: ఎమ్మెల్సీ కవిత
మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టి చలికాచుకుంటున్నారని కేంద్రం అల్లర్లను అరికట్టడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గిరిజన సంక్షేమంపై మండలిలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతు బీజేపీ విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 1లక్ష 50వేల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చిందన్నారు. 1136కోట్లు కల్యాణ లక్ష్మి నిధులు అందించిందన్నారు. తెలంగాణకు కేంద్రం ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వడం లేదన్నారు.
నాలుగు బిల్లులకు మళ్లీ ఆమోదం
గతంలో గవర్నర్ తమిళ సై ప్రభుత్వానికి తిప్పి పంపిన నాలుగు బిల్లులను శనివారం శాసన సభ, శాసన మండలిలు ఆమోదించాయి. వాటిలో మున్సిపాల్టీలలో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 5నుంచి 15కు పెంపు, వైద్య ప్రొఫెసర్ల పదవీ కాలం పొడగింపు బిల్లు, ప్రైవేటు వర్సిటీల బిల్లు, భద్రాచలం పంచాయతీని మరో రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయడం సహా నాలుగు బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.