మా వల్లే.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్నం గురించి తెలిసింది: చంద్ర‌బాబు అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు

విధాత‌: చంద్రబాబుతో పోటీపెడితే పిట్టల దొర కూడా ఓడిపోతాడని ఈరోజు మరోసారి వెల్లడైంది. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం వల్లనే తెలంగాణ ప్రజలకు అన్నం గురించి తెలిసిందని అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుతుంటారు. నేడు హైదరాబాద్‌లో నిర్విహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ప్రారంభం సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రజలకు అసలు అన్నమే తెలియదంటూ తన అజ్ఞానాన్ని మరోసారి ఋజువు చేసుకున్నారు. చరిత్ర చదివితే.. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చిన మాలిక్‌ కపూర్‌ కొండపై నుంచి […]

మా వల్లే.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్నం గురించి తెలిసింది: చంద్ర‌బాబు అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు

విధాత‌: చంద్రబాబుతో పోటీపెడితే పిట్టల దొర కూడా ఓడిపోతాడని ఈరోజు మరోసారి వెల్లడైంది. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం వల్లనే తెలంగాణ ప్రజలకు అన్నం గురించి తెలిసిందని అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుతుంటారు. నేడు హైదరాబాద్‌లో నిర్విహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ప్రారంభం సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రజలకు అసలు అన్నమే తెలియదంటూ తన అజ్ఞానాన్ని మరోసారి ఋజువు చేసుకున్నారు.

చరిత్ర చదివితే..

కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చిన మాలిక్‌ కపూర్‌ కొండపై నుంచి చూస్తూ ఇక్కడి గొలుసు కట్టు చెరువులను వెండి పళ్ళాలు గానూ, ధాన్యపు రాసులను పోగుపడ్డా బంగారు రాసులుగానూ వర్ణించినట్టు తుగ్లక్‌ల చరిత్రకారుడు ఇబూ బటూట్‌ రాశారు. నారా బాబు తానే చరిత్రకారుడి అన్నట్టు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అసలు చరిత్ర చదివితే ఆయనకు అసలు విషయాలు తెలుస్తాయి. ఆయనలోని అజ్ఞానం కొంత తొలిగిపోతుందని నెటిజన్లు అంటున్నారు.

వాస్తవాలు బుర్ర‌కెక్క‌ని చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అనుభజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమకు రాజధాని నిర్మితం అవుతుందని, హైదరాబాద్‌ వంటి మరో నగరం వస్తుందని ఆశించారు. కానీ ఐదేళ్లు గ్రాఫిక్స్‌ చూపెట్టి వారి ఆశలను అడియాశలు చేశారు. అందుకే వైసీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. అయినా చంద్రబాబుకు ఇప్పటికీ వాస్తవాలు బోధపడటం లేదంటున్నారు.

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో సాధించిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది. అలాంటిది బాబు ఐదేళ్ల పాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తానేమి చేశాడో చెప్పకుండా ఇంకా ఏతులు కొట్టడంపై బాబును నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.