ప్రగతి భవన్ గడీ కంచె బద్దలు
ఒకవైపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సన్నాహాలు జరుగుతుండగానే ఇంకోవైపు ప్రగతి భవన్ కంచెల తొలగింపు పనులు షురూ అయ్యాయి.

విధాత: ఒకవైపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సన్నాహాలు జరుగుతుండగానే ఇంకోవైపు ప్రగతి భవన్ కంచెల తొలగింపు పనులు షురూ అయ్యాయి. గ్యాస్ వెల్డింగ్ కట్టర్‌లతో ప్రగతి భవన్ కంచె బారికేడ్లను తొలగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చుతామని , అందరికి సులభంగా ప్రవేశం కల్పిస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా కంచె తొలగింపు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రతిపక్షాలు ఇంతకాలంగా నిజాం కాలంలో గడీలతో పోల్చిన ప్రగతి భవన్ వద్ద జరుగుతున్న కంచెల తొలగింపు పనులు ఆ దారి వెంట వెలుతున్న వాహనదారులు, ప్రజలు గుంపులు గుంపులు ఆగి మరి ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకుందని కామెంట్లు చేస్తున్నారు.