కాంగ్రెస్‌కు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డి సోమవారం ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన నాయకులకు సూచించారు.
అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ లను కలిసి, యూనియన్ నిర్ణయాన్ని ప్రకటించారు. జయరాం రమేష్ ఆర్టీసీ నాయకులను అభినందించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రభుత్వంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఉద్యోగుల భద్రత తదితర అంశాలకు సంబంధించి యూనియన్ల ఇష్టం మేరకు నిర్ణయాలు తీసుకోబోతుందని తెలిపారు