అమెరికా మంచు తుపాను.. తెలుగు దంపతులు మృతి
పర్యావరణ విధ్వంసమే బాంబు సైక్లోన్‌కు కారణమంటున్న వాతావరణ నిపుణులు విధాత: అమెరికా బాంబు సైక్లోన్‌లో చిక్కుకొని తెలుగు దంపతులు చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు మంచు తుపానులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. వీరిది పెదనందిపాడు మండలం పాలపర్రు. మంచు నుంచి హరిత మృతదేహాన్ని వెలికితీయగా నారాయణ మృత దేహం కోసం గాలిస్తున్నట్లు తెలుస్తున్నది. మంచు తుపానులో చిక్కుకొని అమెరికాలో ఇప్పటి దాకా 50మందికి పైగా చనిపోయారు. మునుపెన్నడూ లేని విధంగా అమెరికాను […]

- పర్యావరణ విధ్వంసమే బాంబు సైక్లోన్‌కు కారణమంటున్న వాతావరణ నిపుణులు
విధాత: అమెరికా బాంబు సైక్లోన్‌లో చిక్కుకొని తెలుగు దంపతులు చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు మంచు తుపానులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. వీరిది పెదనందిపాడు మండలం పాలపర్రు.
మంచు నుంచి హరిత మృతదేహాన్ని వెలికితీయగా నారాయణ మృత దేహం కోసం గాలిస్తున్నట్లు తెలుస్తున్నది. మంచు తుపానులో చిక్కుకొని అమెరికాలో ఇప్పటి దాకా 50మందికి పైగా చనిపోయారు.
మునుపెన్నడూ లేని విధంగా అమెరికాను మంచు తుపాను చుట్టుముట్టింది. ఒక్క సారిగా పీడనం పడి పోవటం కారణంగా ఇలాంటి మంచు తుపాను ఏర్పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
అమెరికాలోని ప్రధాన నగరాలు వెర్మాంట్, ఒహియో, ముస్సోరీ, విస్కాన్సిస్, కాన్సాస్, కొలరాడో లాంటి నగరాలు మంచుతో కప్పబడ్డాయి. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఐదున్నర కోట్ల మంది విద్యుత్తులేక చీకటిలో మగ్గుతున్నారు. అమెరికా పశ్చిమ రాష్ట్రాల్లో -45 సెంటిగ్రేడ్‌కు ఉష్ణోగ్రత పడిపోయినట్లు తెలుస్తున్నది. పర్యావరణాన్ని సంరక్షించుకోక పోవటం మూలంగానే ఇలాంటి బాంబ్ సైక్లోన్‌లు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.