Telugu Leaders | తెలుగు చక్రాలు తిరగలేదు!! ఎటూ నిలవని ఆంధ్ర నాయకులు!!
Telugu Leaders విధాత: ఒకనాడు జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పి.. ప్రముఖ స్థానాల్లో వెలుగొందిన తెలుగు నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. తమకు జాతీయ రాజకీయాలు సరిపడవు అనుకున్నారో.. ఇప్పటి నుంచి ఎందుకు తొందర.. మున్ముందు చూద్దాం అనుకున్నారో తెలీదు కానీ.. జాతీయ స్థాయిలో ఇప్పుడు కనిపిస్తున్న సందడిలో తెలుగు నాయకులు ఎందుకనో వెనక నిలబడి జరిగింది అంతా చూస్తున్నారు. అప్పట్లో విపి సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ […]

Telugu Leaders
విధాత: ఒకనాడు జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పి.. ప్రముఖ స్థానాల్లో వెలుగొందిన తెలుగు నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. తమకు జాతీయ రాజకీయాలు సరిపడవు అనుకున్నారో.. ఇప్పటి నుంచి ఎందుకు తొందర.. మున్ముందు చూద్దాం అనుకున్నారో తెలీదు కానీ.. జాతీయ స్థాయిలో ఇప్పుడు కనిపిస్తున్న సందడిలో తెలుగు నాయకులు ఎందుకనో వెనక నిలబడి జరిగింది అంతా చూస్తున్నారు.
అప్పట్లో విపి సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉండేవారు. ఆ తరువాత వాజపేయి ప్రధానిగా ఉన్న ఎన్డీయే కూటమికి చంద్రబాబు కన్వీనర్ గా ఉండేవారు.
ఆ రోజుల్లో కేంద్రంలో జరిగిన పలు రాజకీయ పెను మార్పులకు చంద్రబాబు సారథ్యం కూడా ఉండేది. దేవగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ వంటివారు ప్రధానులు గా ఉన్న సమయంలో చంద్రబాబు మాట బాగా చెల్లుబాటు అయ్యేది.
అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిలు రెండు గ్రూపులుగా ఏర్పడి బల ప్రదర్శన చేస్తూ తమ వర్గాన్ని తాము కాపాడుకునే ప్రయత్నంలో ఢిల్లీ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ మినహా సీనియర్ నాయకులు చంద్రబాబు.. కేసీఆర్.. జగన్.. ఎవరూ వెళ్ళలేదు… అసలు చంద్రబాబు గతంలో బిజెపిలో ఉండేవారు.. తరువాత బయటికి వచ్చి కాంగ్రెస్ తో కలిశారు.. మరీ ఆయన్ను నిన్నటి మీటింగ్ కు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన్ను ఎందుకనో పిలవలేదు.
బిజెపి ఎలాగూ దూరం పెట్టేసింది. ఇక జగన్ కాంగ్రెస్, బిజెపిలు సమదూరం అంటూ వెళ్ళలేదు.. ఇక కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ పెట్టినా అటు కాంగ్రెస్.. బిజెపిలు ఎవరికీ అందకుండా దూరంగా ఉంటున్నారు. మొత్తానికి దేశ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆకుకు అందకుండా.. పోకకు చెందకుండా రెండు వర్గాలతో కూడా గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు. మున్ముందు తమకు ఎవరితో అవసరం వస్తె వాళ్ళకే తమ మద్దతు అనే విధంగా ఉన్నారు.