ఓయూలో ఉద్రిక్తత.. ఆంక్షలు తొలగించాలని విద్యార్థుల గళం

ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతకాలంగా పెట్టిన ఆంక్షలను ఎత్తివేసి స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు

  • By: Somu    latest    Dec 04, 2023 10:14 AM IST
ఓయూలో ఉద్రిక్తత.. ఆంక్షలు తొలగించాలని విద్యార్థుల గళం

విధాత : ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతకాలంగా పెట్టిన ఆంక్షలను ఎత్తివేసి స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. వీసీ రవిందర్‌తో వాగ్వివాదానికి దిగి ఆంక్షల ఎత్తివేతకు డిమాండ్‌ చేశారు.


ముళ్ల కంచెలు, బారీ కేడ్లు తొలగించాలని, రాత్రి 11గంటల తర్వాతా గేట్లు మూసీ వేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వీసీ నియంతృత్వ పాలన విడనాడాలని యూనవర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.