నా మాటలను.. అధిష్టానం, ఠాక్రే లైట్ తీసుకున్నారు: కోమటిరెడ్డి
విధాత: తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు అవకాశం ఉందని ఢిల్లీలో తాను మాట్లాడిన మాటల్లో తప్పులేదని నా పూర్తి వీడియో చూశాక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేతో పాటు పార్టీ అధిష్టానం నా మాటలను లైట్ తీసుకున్నారని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగా ఎంపిక చేయాలని, గెలిచే […]

విధాత: తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు అవకాశం ఉందని ఢిల్లీలో తాను మాట్లాడిన మాటల్లో తప్పులేదని నా పూర్తి వీడియో చూశాక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేతో పాటు పార్టీ అధిష్టానం నా మాటలను లైట్ తీసుకున్నారని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బుధవారం ఆయన మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగా ఎంపిక చేయాలని, గెలిచే అభ్యర్థులను గుర్తించి ఐదు నెలల ముందుగానే టికెట్లు ఇవ్వాలని మాత్రమే చెప్పానన్నారు. కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోవద్దని తన మాటల ఉద్దేశమని, గతంలో టీడీపీతో పొత్తు వల్ల నష్టం జరిగిందని , నిన్నటి తన పొత్తుల వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదన్నారు.
థాక్రే బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచారు కానీ నేను ఆలస్యంగా వచ్చానన్నారు. ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనే దానిపై చర్చించామన్నారు. గతంలో ఆలస్యంగా టికెట్ల అనౌన్స్ చేయడం వల్ల గోల్కొండ హోటల్ లో గొడవలు జరిగాయని, ఈ ధఫా ముందస్తుగా టికెట్లు ఇవ్వాలని తాను కోరినట్లు చెప్పారు. నిన్నటి తన కామెంట్స్ పై చర్చ జరగలేదన్నారు.
నేను మాట్లాడిన అంశాలపై అన్ని ఛానల్స్ తప్పుగా వేశారని, మీడియాలో నా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేశారన్నారు. నా కామెంట్స్‌ను బోసు రాజు తెలుగులో తెప్పించుకొని ఠాక్రేకు వివరించగా ఆయన లైట్ తీసుకున్నారన్నారు.
నా పార్టీ వాళ్ళు నా వీడియో పూర్తిగా చూడలేదనుకుంటా అందుకే నాపై కోపంతో మాట్లాడారన్నారు. ఓ సర్వే రిపోర్ట్ ద్వారా నేను నిన్న మాట్లాడానన్నారు. నా పాదయాత్ర ఈనెల ఆఖరులో ఉంటదని, భువనగిరిలో మొదలు పెడతానని చెప్పారు. ఉత్తమ్ నల్గొండలో మొదలు పెడతారన్నారు. ఖమ్మంలో కూడా యాత్ర చేస్తామన్నారు. గ్రామాల్లో బైక్ యాత్ర చేస్తామని, సర్కార్ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.
పార్టీ లైన్ దాటరాదంటూ ఠాక్రే హెచ్చరిక
అంతకుముందు వెంకట్ రెడ్డితో భేటీ అయిన ఠాక్రే ముందుగా వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆయనకు ప్లే చేసి చూపించారు. తదుపరి వెంకట్ రెడ్డి వీడియోను ఆయనకు చూపారు. వీడియోలో మాట్లాడిన మాటలపై ఠాక్రే కటువుగానే వెంకటరెడ్డిని నిలదీశారు.
పార్టీ వ్యవహారాలపై వ్యక్తిగతంగా మాట్లాడితే సరికాదని, పార్టీ నేతలంతా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించే లేదంటూ ఠాక్రే ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంకట్ రెడ్డి వివాదాస్పద మాటల పైన, అనంతరం ఆయన ఇచ్చిన వివరణపై పార్టీ హై కమాండ్‌కు నివేదిక ఇవ్వనట్లు ఠాక్రే వెల్లడించారు.