CM Kejriwal | అందుకే ప్ర‌ధాని విద్యావంతుడై ఉండాల‌నేది : సీఎం కేజ్రీవాల్

CM Kejriwal | విధాత‌: ప్రధాని మోదీ విద్యార్హ‌తపై దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. రూ.2000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. ఇందుకే ప్ర‌ధాని విద్యావంతుడై ఉండాల‌ని చెప్పేది. అప్పుడేమో రూ.2 వేల నోట్ల‌ను తెస్తున్నాం.. అవినీతి అంత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడేమో వాటిని మార్కెట్ నుంచి తొల‌గిస్తున్నాం.. అవినీతి పోతుంద‌ని చెబుతున్నారు. చెప్పేవారు ఎప్పుడూ వంద చెబుతారు. స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలంటే ప్రధానికి అన్నీ తెలియాలి క‌దా […]

CM Kejriwal | అందుకే ప్ర‌ధాని విద్యావంతుడై ఉండాల‌నేది : సీఎం కేజ్రీవాల్

CM Kejriwal |

విధాత‌: ప్రధాని మోదీ విద్యార్హ‌తపై దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.

రూ.2000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. ఇందుకే ప్ర‌ధాని విద్యావంతుడై ఉండాల‌ని చెప్పేది. అప్పుడేమో రూ.2 వేల నోట్ల‌ను తెస్తున్నాం.. అవినీతి అంత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇప్పుడేమో వాటిని మార్కెట్ నుంచి తొల‌గిస్తున్నాం.. అవినీతి పోతుంద‌ని చెబుతున్నారు. చెప్పేవారు ఎప్పుడూ వంద చెబుతారు. స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలంటే ప్రధానికి అన్నీ తెలియాలి క‌దా అని కేజ్రీవాల్ ట్వీట్లో ఎద్దేవా చేశారు.

ప్ర‌భుత్వం ఆరేళ్ల క్రితం అప్ప‌టి నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ రూ.2 వేల నోట్ల‌ను తెచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ నోటును ర‌ద్దు చేస్తున్నామ‌ని, సెప్టెంబ‌రు 30లోపు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాల‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది.