Kangana Ranaut | ఇప్పటి హీరోయిన్స్ కాస్త ప్రైవసీని, ఇంకాస్త స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ల పరిథి ఏమిటనేది తెలుసుకుని.. అందులోనే హాయిగా జీవించేయాలని చూస్తారు. కానీ కొందరు తారలు దీనికి పూర్తిగా భిన్నం. వాళ్ళు పుట్టిందే కాంట్రవర్సీకి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ముఖ్యంగా బాలీవుడ్లో కాంట్రవర్షియల్ క్వీన్‌గా పేరుగాంచిన తార కంగనా రనౌత్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆమెకు అలవాటు, ఒక్కోసారి కంగనా చేసే కామెంట్స్ ఎదుటివారిని మళ్ళీ మాట్లాడకుండా చేస్తాయి. అలాగే కాంట్రవర్సీకి కేరాఫ్ […]
Kangana Ranaut |
ఇప్పటి హీరోయిన్స్ కాస్త ప్రైవసీని, ఇంకాస్త స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ల పరిథి ఏమిటనేది తెలుసుకుని.. అందులోనే హాయిగా జీవించేయాలని చూస్తారు. కానీ కొందరు తారలు దీనికి పూర్తిగా భిన్నం. వాళ్ళు పుట్టిందే కాంట్రవర్సీకి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ముఖ్యంగా బాలీవుడ్లో కాంట్రవర్షియల్ క్వీన్‌గా పేరుగాంచిన తార కంగనా రనౌత్.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆమెకు అలవాటు, ఒక్కోసారి కంగనా చేసే కామెంట్స్ ఎదుటివారిని మళ్ళీ మాట్లాడకుండా చేస్తాయి. అలాగే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కూడా కంగనానే. మొహం మీదే మాట్లాడేయడం వల్ల చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంది కూడా. అయినా ఆమె పద్దతిలో పెద్దగా మార్పు రాలేదు. అందుకేనేమో అభిమానులు ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటారు.
బాలీవుడ్లో ఏదైనా విషయంలో స్పందించాలంటే మాటల పరంగా కంగనానే ముందుంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలతో అన్ని చోట్ల చర్చనీయాంశంగా మార్చే.. మారే సత్తా ఆమెకే సొంతం. అప్పుడప్పుడు తనకు అస్సలు అవసరం లేని గొడవల్ని కూడా నెత్తిన వేసుకుని గొడవల్లోకి దిగుతుంది.
నిజం చెప్పాలంటే అవన్నీ కొనితెచ్చుకున్న వివాదాలే.. ఏది ఏమైనా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటూ ఉంటుందీ అమ్మడు. తాజాగా ఇలాంటి ఓ వివాదంలోనే ఇరుక్కుంది. మాములుగా నోటి దురుసుతనం వల్ల చిక్కుల్లో పడతాం కానీ కంగనా అనే మనిషే దురుసుతనం గల మహిళ. దీనితో ఆమె ఎక్కడుంటే అక్కడో వివాదం.
అయితే సూటిగా మాట్లాడటం కూడా ఒక్కోసారి వివాదాల్లోకి తోసేస్తుంది. నిజం చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలంటూరు ఇందుకేనేమో… మొన్నామధ్య కంగనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు తెలిసిన నాలుగు రహస్యాలు బయటపెట్టింది. కంగనా ఆ ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ జనాలు దాదాపు 99శాతం మంది డ్రగ్స్‌కు అలవాటు పడినవారే. అయితే ఇలా నిజాన్ని చెప్పడానికి నాలా ఎవరూ ముందుకు రారు.
ఎందుకంటే వాళ్ళకు భయం. కానీ నేను వేటికీ భయపడను. ఓ స్టార్ హీరోకి డ్రగ్స్ విపరీతంగా తీసుకునే అలవాటుంది. దానితో అతన్ని వదిలి భార్య వెళిపోయింది. ఇవన్నీ నాకు తెలియడానికి నేను అతనితో కొన్నాళ్ళు డేటింగ్ చేశాను. కాబట్టి నాకు తెలుసు. కానీ ఆ స్టార్ హీరో కుటుంబం నన్ను బెదిరించారు.. దీనితో అతనికి దూరంగా జరిగాను. కానీ అతగాడు డ్రగ్స్ తీసుకోవడాన్ని నేను చూశాను అని చెప్పుకొచ్చింది.
దీంతో కంగనా చెప్పేది హృతిక్ రోషన్ గురించేనని., ఆమె అతనితోనే కొద్దికాలం డేటింగ్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా తనకు అక్కరలేని విషయాలను కెలికి మరీ వివాదాల్లో చిక్కుకుంటుంది కంగనా. అందులో హృతిక్ అంటే తోక తొక్కిన త్రాచులా ఎగిసిపడుతుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే.. తను కొంచెం డౌన్ అవుతుంది అనుకుంటే చాలు.. హృతిక్‌ని కావాలని కెలుకుతుంటుంది.
కంగనా నెక్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఎమర్జన్సీ’ మూవీలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. వివాదాల సంగతి ఎలా ఉన్నా.. నటిగా కంగనకు మంచి మార్కులే పడుతున్నాయి. ‘ఎమర్జన్సీ’ చిత్రాన్ని కంగనానే స్వీయ దర్శకత్వం వహిస్తుంది. ఇక మరో చిత్రం ‘చంద్రముఖి 2’లో కూడా కంగనా నటిస్తోంది. ఈ సినిమా వినాయకచవితికి విడుదల కానుంది.