పెళ్లి బాజాలు.. చావు సప్పుళ్లయ్యాయి.. స్టేజీపైనే నవ వధువు మృతి
UTTHAR PRADESH: పెళ్లి బాజాలు.. చావు సప్పుళ్లయ్యాయి. పెండ్లిపీటల మీద వధూవరులు దండలు మార్చుకొనే సమయంలో నవ వధువు కుప్పకూలింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఏం జరిగిందని చూసేలోపే ఆమె ఊపిరి వదిలింది. కార్డియాక్ అరెస్టు కారణం కావొచ్చని బంధువులు వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నో శివారులోని భద్వానా గ్రామంలో జరిగిన ఈఘటన చూపరులను కంటనీరు పెట్టించింది. పెళ్లి కూతురుకు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బంధువులు అంటున్నారు. ఉన్నట్లుండి పెళ్లిపీటల మీద కూలిపోవటంతో […]

UTTHAR PRADESH: పెళ్లి బాజాలు.. చావు సప్పుళ్లయ్యాయి. పెండ్లిపీటల మీద వధూవరులు దండలు మార్చుకొనే సమయంలో నవ వధువు కుప్పకూలింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఏం జరిగిందని చూసేలోపే ఆమె ఊపిరి వదిలింది. కార్డియాక్ అరెస్టు కారణం కావొచ్చని బంధువులు వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నో శివారులోని భద్వానా గ్రామంలో జరిగిన ఈఘటన చూపరులను కంటనీరు పెట్టించింది.
పెళ్లి కూతురుకు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బంధువులు అంటున్నారు. ఉన్నట్లుండి పెళ్లిపీటల మీద కూలిపోవటంతో అటు తల్లి దండ్రులతో పాటు, పెళ్లికుమారుడి తరపు వారు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎన్నో ఆశలతో పెండ్లి పీటలెక్కిన అమ్మాయి నిలువునా కూలిపోయిన ఘటనతో ఆ గ్రామ ప్రజలంతా కన్నీరు మున్నీరయ్యారు