ముగిసిన రాష్ట్రపతి శీతకాల విడిది
తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శనివారం ఆమె హకీంపేట వైమానిక కేంద్రం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు

విధాత : తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శనివారం ఆమె హకీంపేట వైమానిక కేంద్రం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి డిసెంబరు 18న హైదరాబాద్ బొల్లారంలోని తన నివాసానికి వచ్చారు.
పర్యటనలో భాగంగా పోచంపల్లిని రాష్టపతి సందర్శించారు. థీమ్ పెవిలియన్ పార్కులో చీరల తయారీ యూనిట్‌ను, అక్కడ కార్మికులు మగ్గాలపై నేస్తున్న చీరలను ఆసక్తిగా పరిశీలించారు. అవార్డు గ్రహితలైన నేత కార్మికులతోనూ భేటీ అయ్యారు. అలాగే బొల్లారంలోని తన నిలయంలో రాష్ట్ర గవర్నర్, సీఎంలకు, ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు ఎట్ హోం తేనేటీ విందు ఇచ్చారు.