తండ్రిని హతమార్చిన తనయుడు
విధాత, మద్యం మత్తులో రోజు తల్లిని వేధిస్తున్న తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కోమండ్ల బ్రహ్మం (45) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవిస్తుండగా అతను మద్యానికి బానిస అయ్యాడు. ఆయనకు భార్య అలివేలు, ఒకేషనల్ కోర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి మద్యం తాగిన బ్రహ్మం పొలం నుంచి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తండ్రి […]

విధాత, మద్యం మత్తులో రోజు తల్లిని వేధిస్తున్న తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కోమండ్ల బ్రహ్మం (45) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవిస్తుండగా అతను మద్యానికి బానిస అయ్యాడు. ఆయనకు భార్య అలివేలు, ఒకేషనల్ కోర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
శుక్రవారం రాత్రి మద్యం తాగిన బ్రహ్మం పొలం నుంచి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తండ్రి నిత్యం తాగి వచ్చి తల్లిని అన్నం తినకుండా గొడవ పడుతున్నాడని ఆగ్రహించిన కుమారుడు తలపై రొకలిబండతో బలంగా కొట్టాడు.
తీవ్రగాయాలైన బ్రహ్మమును ఇరుగుపొరుగు సహాయంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రహ్మం మృతి చెందాడు . కొండపల్లి ఇన్చార్జి సీఐ విఠల్ రెడ్డి, ఎస్ఐ వీరబాబులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.