Rahul Gandhi
విధాత: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ‘మోదీ ఇంటిపేరుపై చేసిన పరువునష్టం కేసులో స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు నాలుగో తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వంతోపాటు ఫిర్యాదుదారుడు పూర్ణేష్ మోదీకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన అప్పీల్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను నాలుగో తేదీకి వాయిదావేసింది.
తన నేరారోపణపై స్టే విధించాలన్నరాహుల్ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. జూలై 7 నాటి హైకోర్టు తీర్పుపై స్టే విధించకపోతే, అది ‘స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ, ఆలోచన, ప్రకటనలకు అంతరాయం’ కలిగిస్తుందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు తన అప్పీల్‌లో పేర్కొన్నారు.
మోడీ ఇంటిపేరు గురించి చేసిన వ్యాఖ్యలకు నేరారోపణ చేసిన నేరారోపణపై గుజరాత్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో మార్చి 24న కాంగ్రెస్ నాయకుడు ఎంపీగా అనర్హుడయ్యాడు. ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని సైతం వీడాల్సివచ్చింది