Nikhil | అప్పుడు.. డ్రగ్స్ తీసుకుని ఉంటే హ్యాపీడేస్ సినిమా చేసేవాడిని కాదు: హీరో నిఖిల్
Nikhil Nikhil | డ్రగ్స్ కేస్ అంటే చాలు.. అందునా సినీ తారలు అందులో ఉన్నారంటే.. ఆ కేస్‌పై ఎటువంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో అని.. ఓ చెవ్వు దాని కోసం వేసే ఉంచుతారు జనం. 2018 నాటి డగ్స్ కేసు గురించి మరిచిపోక ముందే మళ్ళీ తెలుగు సినీ ప్రపంచంలో కేపీ చౌదరి కేసు ఓ సంచలనమై కూర్చుంది. దీనికోసం అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారణ […]

Nikhil
Nikhil | డ్రగ్స్ కేస్ అంటే చాలు.. అందునా సినీ తారలు అందులో ఉన్నారంటే.. ఆ కేస్‌పై ఎటువంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో అని.. ఓ చెవ్వు దాని కోసం వేసే ఉంచుతారు జనం. 2018 నాటి డగ్స్ కేసు గురించి మరిచిపోక ముందే మళ్ళీ తెలుగు సినీ ప్రపంచంలో కేపీ చౌదరి కేసు ఓ సంచలనమై కూర్చుంది.
దీనికోసం అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. అతనితో సన్నిహితంగా ఉన్న కొందరి పేర్లను కూడా బయట పెట్టారు కూడా. ఈ నేపథ్యంలో యువ నటుడు నిఖిల్ చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్ దుర్వినియోగం, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్, నటుడు ప్రియదర్శి పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ.. గతంలో కొందరు నాకు డ్రగ్స్ ఆఫర్ చేసిన సందర్భాలున్నాయి.. కాకపోతే అప్పుడు తిరస్కరించి బలంగా నిలబడటం వల్లనే మంచి సినిమాలతో విజయాలను అందుకోగలి గానన్నాడు. అప్పుడే కనుక తను డ్రగ్స్ తీసుకుని ఉంటే హ్యాపీడేస్ సినిమా చేసి ఉండేవాడిని కాదని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాక కూడా డ్రగ్స్ ఆఫర్ చేసినా తీసుకోకపోవడమే కార్తికేయ 2 వరకూ ఆగని ప్రయాణాన్ని ఇచ్చిందని.. చిన్న చిన్న మొహమాటాలకు పోయి డ్రగ్స్ మత్తులో చిక్కుకుంటే ఫలితాలకు జీవితాలు బలికావడమేనని నిఖిల్ తెలిపాడు.
ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాదు, మత్తు పదార్థాలు బానిసల్ని చేస్తాయని, వాటి జోలికి పోకపోవడమే అన్నివిధాలా యువతకు మంచిదని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ సందర్భంగా పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని పేరెంట్స్ గమనించాలని, చదువుకునే స్టూడెంట్స్ కూడా భవిష్యత్ గురించి ఆలోచించాలని నిఖిల్ చెప్పుకొచ్చాడు.
అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనేక రకాల అనుమానాలకు తావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హ్యాపీడేస్ అన్నాడు కాబట్టి.. అందులో నటించిన వారు నిఖిల్ అంతగా ఇప్పుడు ఫేమస్ కాలేకపోయారు.
అంటే వారు డ్రగ్స్ తీసుకుని లైఫ్ పాడు చేసుకున్నారా? అనేలా నిఖిల్ మాటలకు అర్థాలు తీస్తున్నారు. అలాగే తనకి డ్రగ్స్ ఆఫర్ చేసినట్లుగా కూడా నిఖిల్ చెప్పాడు.. ఆ ఆఫర్ చేసిన వాళ్లు ఎవరో కూడా చెప్పవచ్చుగా అంటూ కొందరు నిఖిల్ మాటలపై సెటైర్స్ వేస్తున్నారు.