Swarupanandendra Swamy | ఇంత దారుణం ఎన్నడూ లేదు… కోపానికొచ్చిన స్వరూపానందేంద్ర స్వామి
Swarupanandendra Swamy చందనోత్సవంలో భక్తుల అగచాట్లు విధాత:విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి(Swarupanandendra Swamy) ఆంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అవధూతగా పేరు.. అటు కేసీఆర్,, ఇటు జగన్ .. ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ వారికోసం రాజశ్యామల యాగం వంటివి చేయడం.. వారి విజయానికి తన వంటి కృషి చేసానని చెప్పుకోవడం జరుగుతూ వస్తోంది. ఆమధ్య సైతం కేసీఆర్ వచ్చి స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. జగన్ సైతం వచ్చి కలుస్తుంటారు. […]

Swarupanandendra Swamy
చందనోత్సవంలో భక్తుల అగచాట్లు
విధాత:విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి(Swarupanandendra Swamy) ఆంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అవధూతగా పేరు.. అటు కేసీఆర్,, ఇటు జగన్ .. ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ వారికోసం రాజశ్యామల యాగం వంటివి చేయడం.. వారి విజయానికి తన వంటి కృషి చేసానని చెప్పుకోవడం జరుగుతూ వస్తోంది.
ఆమధ్య సైతం కేసీఆర్ వచ్చి స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. జగన్ సైతం వచ్చి కలుస్తుంటారు. జగన్ గెలుపు కోసం తానూ తపస్సు చేశానని చెప్పుకున్నారు స్వామిజి.. అంతేకాకుండా తన అనుయాయులకు తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా సైతం ఎపాయింట్ చేసుకునే స్థాయి ఈ స్వామీజీకి ఉంది. జగన్ మీద.. ఈగ కూడా వాలనివ్వకుండా ఉంటారు.
కానీ నిన్న జరిగిన సింహాచలం చందనోత్సవంలో మాత్రం ఏర్పాట్లు సరిగా లేవని, భక్తులకు కష్టాలు, కడగండ్లు మిగిలాయని, దేవస్థానం అన్నిటా విఫలమైందని ఇంతటి దారుణమైన పరిస్థితి తాను ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
వాస్తవాన్ని ఎదుటి పొడువునా చందనం పూతతో ఉండే సింహాచలం అప్పన్న స్వామి ఈ చందనోత్సవం రోజున మాత్రం నిజరూపాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. ఆరోజున స్వామి మూర్తి మీద ఉన్న చందనాన్ని మొత్తం తొలగించాలి భక్తులకు దర్శనం చేయించి, మళ్ళీ స్వామిని చందనం పూతతో కప్పేస్తారు.
ఈ అద్భుత దర్శనం కోసం వేలాదిమంది జనం వస్తారు.. సింహగిరి భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఈ క్రతువు సింహాద్రి అప్పన్న ఉత్సవాల్లో ప్రముఖమైనది. ఈ ఉత్సవం శనివారం జరగగా ఈ ఏర్పాట్ల మీద స్వామిజి బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. స్వామికి అంత కోపం ఎందుకు వచ్చిందన్నది అర్థం కాలేదు.
ఆయన ఏమన్నారంటే.. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారు
గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవు.. నా జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యాను. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నా.కొండ కింద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించింది. ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదు అని స్వరూపానందేంద్ర బహిరంగంగా విమర్శలు చేసారు. గతంలో స్వామిజి ఎన్నడూ ఇలా బయటపడి మాట్లాడింది లేదు కానీ ఈసారి ఇలా ఎందుకు అన్నారో అని భక్తులు, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.