Mahesh Babu | ఈ విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు మహేష్.. ఇదంతా జక్కన్న కోసమేనా?

Mahesh Babu విధాత‌: ‘ఎండ కన్నెరగని పసివాడనే’ మాటకు సరైన అర్థం మహేష్. అతన్ని చూస్తే అసలు కష్టపడే అలవాటు లేని శరీరమని ఇట్టే తెలిసిపోతుంది. చాలా సుకుమారంగా ఉంటే ప్రిన్స్ మహేష్ ఓ సినిమా కోసం కండల వీరుడిగా కనిపించడానికి చేస్తున్న కసరత్తులు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఇలా హీరోలతో కసరత్తులు చేయించి మరీ, కండల వీరుల్లా భారీ విగ్రహాల్లా కనిపించాలని తపించే దర్శకుడు రాజమౌళి అంటే ఆ మాత్రం ఉండాలిగా. ‘బాహుబలి’ సినిమా కోసం […]

Mahesh Babu | ఈ విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు మహేష్.. ఇదంతా జక్కన్న కోసమేనా?

Mahesh Babu

విధాత‌: ‘ఎండ కన్నెరగని పసివాడనే’ మాటకు సరైన అర్థం మహేష్. అతన్ని చూస్తే అసలు కష్టపడే అలవాటు లేని శరీరమని ఇట్టే తెలిసిపోతుంది. చాలా సుకుమారంగా ఉంటే ప్రిన్స్ మహేష్ ఓ సినిమా కోసం కండల వీరుడిగా కనిపించడానికి చేస్తున్న కసరత్తులు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఇలా హీరోలతో కసరత్తులు చేయించి మరీ, కండల వీరుల్లా భారీ విగ్రహాల్లా కనిపించాలని తపించే దర్శకుడు రాజమౌళి అంటే ఆ మాత్రం ఉండాలిగా.

‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్, రానాలను ఒకరిని మించి ఒకరిని భారీ కాయాలుగా తయారు చేసి నిలబెట్టాడు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, ఎన్టీఆర్‌‌లను కూడా అలానే మార్చేశాడు. ఇప్పుడు త్వరలో ప్రారంభం కానున్న SSMB29 సినిమా కోసమే అన్నట్లుగా.. మహేష్‌తో అందుకు తగ్గట్టుగా కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ ఇందులో నాన్‌స్టాప్ వర్కవుట్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

వాస్తవానికి రాజమౌళి సినిమా కోసమనే కాదు.. మహేష్ బాబు ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది జిమ్‌లోనే అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటికీ మిల్క్ బాయ్‌లోనే కనిపిస్తుంటాడు. ఇక రాజమౌళితో సినిమా అంటే.. మహేష్ మ్యాగ్జిమమ్ జిమ్‌లో ఉండక తప్పదు మరి. రాజమౌళి కోరుకున్నట్టుగా తెరమీద కనిపించడానికి హీరోలు కష్టపడితే.. వాళ్లను తెరమీద ఎలా చూపిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే విషయంలో ఆయనకి పర్ఫెక్ట్ స్కెచ్ ఉంటుంది.

అందుకే లుక్ విషయంలో రాజమౌళి కాస్త ఎక్కువగానే హీరోలను ఇబ్బంది పెడుతుంటాడు. హీరో తను అనుకున్న షేప్‌లో కనిపించే వరకూ వదలడు. బాహుబలి సినిమా కోసం రెండు రకాలుగా కనిపించడానికి ప్రభాస్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న ఎలా టార్చర్ పెట్టాడో సరదాగా చరణ్, తారక్‌లు కూడా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు.

ఇంత ప్రణాళికతో పాత్రల తీరుతెన్నులు తెరమీద కనిపించాలని తాపత్రయ పడతాడు కనుకే రాజమౌళి గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఇదే అతని సక్సెస్ సీక్రెట్. ఇక తన తర్వాతి మూవీలో సైతం కండలతో మహేష్‌ని చూపించాలనే ప్రయత్నాలేనట ఇవన్నీ. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసిందని కూడా అంటున్నారు. మహేష్ బర్త్‌డే రోజు మూవీ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మహేష్ వర్కవుట్స్ విషయానికి వస్తే.. ఇది తను ఎప్పుడూ చేసే మామూలు వర్కవుట్స్ అని చెప్పినా కూడా ఇదంతా రాజమౌళి సినిమా కోసమేననేలా టాక్ నడుస్తుంది. ఇక మహేష్ లుక్‌ని రాజమౌళి ఎలా చూపించాలని అనుకుంటున్నాడో.., ఆయన ఎలా డిసైడ్ చేసాడోననే క్యూరియాసిటీ మహేష్ ఫ్యాన్స్‌లో ఎక్కువైంది. చూడాలి మహేష్ ఎలా కనిపించబోతున్నాడో మరి. అయితే ఆ సినిమా కంటే ముందు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ సినిమాపై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి మరి.